విశాఖ

ఉపాధి హామీ పనులకై ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం,జూన్ 9: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా పిల్లవానిపాలెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు గురువారం రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంపై ఉపాధి హామీ కూలీలు వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సమయంలో తహశీల్దార్ సిద్ధ య్య స్పందించి ఆందోళనకారులకు నచ్చచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి ంది. గ్రామంలో చిన్నఅప్పన్న చెరువు ఆక్రమణకు గురికావడంతో ఉపాధి హామీ పనులకు నోచుకోక కూలీలు వలసలు పోతున్నారని, మరోవైపు ఆయకట్టు భూములకు సాగునీరు అందలేనందున ఆక్రమణలను తొలగించాలని గత ఏడాది అక్టోబర్‌లో గ్రామస్థులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై ఎటువంటి చ ర్యలు చేపట్టనందుకు నిరసనగా ఆందోళన చేపట్టామని కూలీ సిద్ధ అప్పారావు తె లిపారు. 11ఎకరాల చెరువుపూర్తిగా ఆక్రమణలకు గురైందని తెలిపారు. ప్రభుత్వ రికార్డుల్లో చెరువు ఉన్నందున ఏటా పూడికతీతకు ఉపాధి హామీ నిధులు మంజూరవుతున్నాయి. కూలీలు చెరువు పనులకు సిద్ధపడగా ఆక్రమణదారులు దాడులకు పాల్పడుతున్నారని నూకరాజు, కృష్ణ వాపోయారు. దీంతో చెరువు ఆక్రమణలను గుర్తించాలని తహశీల్దార్ సిద్ధయ్య ఆర్‌ఐ., సర్వేయర్లను ఆదేశించారు.