విశాఖ

నాల్గవ యూనిట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జూన్ 9: సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నాల్గవ యూనిట్ మరమ్మతు పనులను పూర్తి కావడంతో గురువారం వినియోగంలోకి వచ్చింది. దీనిద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ తెలిపారు. ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ నాల్గవ యూనిట్ టాక్టర్ విభాగంలో ఎర్త్ సాంకేతిక లోపాలు తలెత్తడంతో గతనెల 21వతేదీ నుంచి ఈ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి మరమ్మతులు చేపట్టామన్నారు. ఎర్త్ లోపాలు వలన యూనిట్‌లో టాక్టర్‌లోని 10 బస్ బార్‌లు కాలిపోయాయని, వీటిని తొలగించి కొత్త బస్‌బార్‌లను యూనిట్‌లో వేశామన్నారు.
ఈపనులు ఈనెల 3వతేదీ నాటికి పూర్తి కావాల్సినప్పటికీ కొంత జాప్యం జరిగిందన్నారు. సుమారు 24 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అయిందన్నారు. బుధవారం నాటికి పనులు పూ ర్తి కావడంతో ముందుగా ట్రైల్ బేస్‌లో యూనిట్‌ను 24 గంటలు స్పిన్నింగ్‌లో పెట్టామన్నారు. అనంతరం గురువారం ఉదయం నుంచి యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామన్నారు. మూడవ యూనిట్ బ్రేకర్ పనులు మరో మూడు రోజుల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు.