విశాఖ

శరవేగంగా రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), జూన్ 9: ఎ-గ్రేడ్ హోదాలో ఉన్న అనకాపల్లి రైల్వేస్టేషన్ మరికొద్ది రోజుల్లో రూపు మారనుంది. విజయవాడ డివిజన్ పరిధిలో అనకాపల్లి స్టేషన్‌కు అన్ని విధాలు గా అత్యధిక అదాయం వస్తున్నట్లు దక్షి ణ మధ్య రైల్వే గుర్తించింది. అందుకు అనుగుణంగా ప్రయాణికులకు అన్ని వౌళిక వసతులు కల్పించడానికి దక్షిణ మధ్య రైల్వే సుమారు ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఈ స్టేషన్ అభివృద్ధిపై స్థానిక పార్లమెంటు సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనువాసరావు ఢిల్లీలో రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గు ప్తాను కలిసి చర్చించారు. ఆయన వినతి మేరకు రవీంద్ర గుప్తా అనకాపల్లి స్టేషన్‌ను సందర్శించి పరిశీలించారు. ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యార్ధం రెండు, మూడు ప్లాట్‌ఫారాల మధ్యలో 50 లక్షల రూపాయలతో ఎస్కలేటర్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణీకుల రద్దీని అనుసరించి గూడ్సుషెడ్ వద్ద మరో టికెట్ కౌంటర్‌ను నిర్మిస్తున్నారు. మొ త్తం అన్ని ఫ్లాట్‌ఫారాలపై శిథిలమైన కుళాయి దిమ్మలను తొలగించి కొత్తవాటిని నిర్మించారు. ఎత్తు తక్కువగా ఉన్న ప్లాట్‌ఫారాల ను ఎత్తుచేసి యాంటీ స్కి డ్ టైల్సు ఏర్పాటుచేశారు. ప్రయాణీకులు కూర్చోవడానికి అధునాతమైన టైల్స్‌తో దిమ్మ లు నిర్మిస్తున్నారు. రెండు మూడు ప్లాట్‌ఫారాల మధ్యలో ఉన్న ఖాళీస్థలాన్ని అ ందమైన మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దారు. గూడ్సుషెడ్ వద్ద ఉన్న ఖాళీస్థలాన్ని పూర్తిగా సిసిరోడ్డు నిర్మించడంతో అటుగా వచ్చిన ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. రానున్న రోజుల్లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫ్లారంపై మరో ఎస్కలేటర్ నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు అధికారులు వె ల్లడించారు. విజయవాడ డివిజన్ పరిధిలో అనకాపల్లి స్టేషన్‌కు అభివృద్ధితో అధిక ప్రాముఖ్యతను ఇచ్చి అన్ని వౌ ళిక వసతులతో ఒక మోడల్ రైల్వేస్టేషన్ గా తీర్చిదిద్దడానికి దక్షిణ మధ్య రైల్వే కృషి చేస్తుంది. గత కొన్ని నెలలుగా జ రుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు రైల్వే ఉన్నతాధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు. స్టేషన్ మేనేజర్ కొమ్మిశెట్టి పార్ధసారధి పర్యవేక్షణలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.