విశాఖ

కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 10: కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. శుక్రవారం రాత్రి ఆమె విలేఖరులతో మాట్లాడుతూ కాపులకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షను భగ్నం చేసేందుకు అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. కాపుల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ నిధులు కాపులను ఉద్దరించడానికి ఏమేరకు సరిపోతాయో వివరించాలన్నారు. న్యాయమైన కాపుల సమస్యలను ఇప్పటికైనా చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే మంచిదన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత తనకు లేదంటూ మాజీ మంత్రి మణికుమారి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండిస్తూ ప్రజలే తనకు ఆ అధికారం ఇచ్చారనే విషయాన్ని మణికుమారి తెలుసుకుంటే మంచిదన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా త్రిసభ్య కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించిన మణికుమారి రాజీనామా ఎంతవరకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. అనకాపల్లిలో ఇటీవల జరిగిన మినీ మహానాడులో కనీసం మణికుమారికి మైకు ఇవ్వని పరిస్థితిని గుర్తెరిగి ఎవరి అర్హతలు ఏమిటో తెలుసుకోవాలని ఈశ్వరి హితవు చెప్పారు.