విశాఖ

ఐటిడిఎలో ఇ-ఆఫీస్ పాలనపై శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 10: పాడేరు ఐటిడిఎ కార్యాలయంలో వారం రోజులలోగా కాగిత రహిత పాలనను అమలులోకి తీసుకురానున్నట్టు సంస్థ ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్ తెలిపారు. స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో ఇ-ఆఫీస్ నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన శిక్షణను ఆయన ప్రారంభించారు. ఐటిడిఎ నుంచి వెళ్లవల్సిన దస్త్రాలన్నీ ఇకపై ఇ-ఆఫీస్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు, సిబ్బందికి ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఐటిడిఎలోని గిరిజన సంక్షేమ విద్య, వెలుగు, సమగ్ర నీటి యాజమాన్య సంస్థ, ఐటి.డిఎ, ప్రాజెక్టు ఉద్యానవన విభాగం, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, ప్రాజెక్టు వ్యవసా య విభాగాలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ఇ-ఆఫీస్ విధానంపై శిక్షణ ఇస్తున్నామని, అధికారులు, సిబ్బ ంది పూర్తిస్థాయిలో దీనిపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ విధానం అమలులోకి రానున్నదని, దీనిని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది సన్నద్ధం కావాలని హరినారాయణన్ సూచించారు. ఇ-ఆఫీస్ విధానంలో దస్త్రాలను ఏవిధంగా రూపొందించాలనే దానిపై ట్రైనర్ శేఖర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శివశంకర్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.కమల, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమార్, వెలుగు ఎ.పి.డి. దాసరి రత్నాకర్, ప్రాజెక్టు ఉద్యానవన అధికారి కె.చిట్టిబాబు, ఉపాధి హామీ పథకం ఎపిడి లచ్చన్న, మేనేజర్ వేగి అప్పారావు పాల్గొన్నారు.