విశాఖ

రహదారి దిగ్బంధం జాతీయ రహదారిపై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, జూన్ 30: పాయకరావుమండలం పాల్మన్‌పేట మత్స్యకారులపై అదే పంచాయతీ శివారు గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గీయులు పాతకక్షల నేపథ్యంలో గత మంగళవారం నాడు దాడులకు దిగి మత్స్యకారులను గాయపర్చడంతోపాటు ఆస్తుల ధ్వంసాన్ని నిరశిస్తూ ఆ గ్రామ మత్స్యకారులు గురువారం తీవ్రంగా స్పందించారు. పాల్మన్‌పేటలోని మత్స్యకార యువకులు భారీ ఎత్తున తరలివచ్చి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని గొల్ల అప్పారావు జంక్షన్ వద్ద మత్స్యకార యువకులు కొద్దిసేపు రాస్తారోకో, ఆందోళన కార్యక్రమం చేపట్టా రు. ఈ విషయం తెలుసుకున్న తుని పట్టణ పోలీసులు హుటాహుటిన మత్స్యకారుల ఆందోళన చేస్తున్న జంక్షన్‌కు తరలివచ్చి పాల్మన్‌పేట విశాఖజిల్లాలో ఉన్నందున ఆందోళన ఇక్కడ చేయడానికి వీలులేదని మత్స్యకారులకు సర్దిచెప్పడంతో మత్స్యకార యువకులు తమ నిరసన కార్యక్రమాన్ని అక్కడ విరమించుకుని పాయకరావుపేట మండల పరిధిలోని తాండవ సుగర్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద గల జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో జరిపి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. రాజయ్యపేట గ్రామంలో ఉన్న యాదవ వర్గీయులు అకారణంగా తమపైనా, తమ ఇళ్లపైనా దాడులు చేసి మత్స్యకారులను గాయపరిచారని అక్కడితో ఆగకుండా తమతమ ఇళ్లపై దాడులు చేసి విలువైన గృహోపకరణాలతోపాటు ఆస్తుల ధ్వంసం చేయడాన్ని నిరశిస్తూ ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. రాస్తారోకో చేసి కొద్దిసేపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న పాయకరావుపేట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలివచ్చి మత్స్యకారులకు సర్దిచెప్పి ఆందోళనను మరికొద్ది నిమిషాల్లోనే విరమింపజేశారు. మత్స్యకారులపై రాజయ్యపేట గ్రామస్తుల దాడులపై పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించి నిందితులను వెంటనే పట్టుకుని 58మందిని అరెస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు ఆందోళనకారులకు వివరించడంతో మత్స్యకారులు ఆందోళన విరమించుకుని వెనుదిరిగారు. పాల్మన్‌పేటలో గురువారం నాడు 250మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితి శాంతియుతంగా ఉంది. అలాగే 144 సెక్షన్ కూడా అమలులో ఉండటంతో ఈ రెండు గ్రామాల్లోను వైరి వర్గీయులు తమ ఇళ్ల వద్దనే ఉండి జీవనం సాగిస్తున్నారు. పరారీలో ఉన్న నింధితుల కోసం పోలీసులు తమ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నర్సీపట్నం ఎఎస్పి ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తుతోపాటు ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు చేపడుతున్నారు.