విశాఖ

రద్దీని తట్టుకునేందుకు మరికొన్ని రైళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమిబ్యూరో

విశాఖపట్నం, మార్చి 17: వేసవి రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రయాణికులకు విశాఖ నుంచి పలు ముఖ్యమైన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ళను నడపాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ కమర్షియల్ విభాగం అధికారులు నిర్ణయించారు. దీనిలోభాగంగా మరికొన్ని ప్రత్యేక రైళ్ళను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి త్వరలో పట్టాలెక్కనున్నాయి. విశాఖపట్నం-తిరుపతి (08573) వీక్లీ సువిధ ప్రత్యేక రైలు విశాఖపట్నం నుంచి ప్రతి సోమవారం రాత్రి 10.55గంటలకు బయలుదేరి తిరుపతికి మరుసటి రోజున మధ్యాహ్నం 1.25గంటలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు వచ్చేనెల నాల్గవ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు నడువనుంది. అలాగే తిరుపతి-విశాఖపట్నం (08574) సువిధ ప్రత్యేక రైలు తిరుపతిలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు బయలుదేరి మరుసటి రోజున ఉదయం 6.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.ఇది వచ్చేనెల 5వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తేనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో నిలుస్తుంది. దీనిలో సెకండ్ ఏసి-1, థర్డ్ ఏసి కోచ్‌లు-3, స్లీపర్‌క్లాస్‌లు-9, సెకండ్ క్లాస్ సిటింగ్ కోచ్‌లు-6, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లు మరో రెండు సదుపాయం కల్పించబడింది.
* విశాఖ-సికింద్రాబాద్ మధ్య మరో ప్రత్యేకం
విశాఖపట్నం-సికింద్రాబాద్ (08501)ల మధ్య వీక్లీ ప్రత్యేక రైలు నడువనుంది. ఇది ప్రతి మంగళవారం రాత్రి 11గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి సికింద్రాబాద్‌కు మరుసటి రోజున 12గంటలకు చేరుకుంటుంది. ఈ విధంగా వచ్చేనెల 5వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు నడువనుంది. అలాగే సికింద్రాబాద్-విశాఖపట్నం (08502) మధ్య వీక్లీ ప్రత్యేక రైలు నడువనుంది. ఇది సికింద్రాబాద్‌లో ప్రతి బుధవారం సాయంత్రం 4.20 గంటలకు బయలుదేరి విశాఖపట్నంనకు మరుసటి రోజున వేకువజామున 4.50గంటలకు వస్తుంది. ఈ ప్రత్యేక రైలులో సెకండ్ ఏసి-1, థర్డ్ ఏసి కోచ్‌లు-3, స్లీపర్ క్లాస్‌లు-10, సెకండ్ క్లాస్ సిటింగ్ కోచ్‌లు-6, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజీ కోచ్‌లు-2 సదుపాయం కల్పింబడ్డాయి. దీనికి దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలు హాల్ట్ ఉంది.
* సంబల్‌పూర్-యశ్వంత్‌పూర్ (08301)
ఈ రెండింటితో పాటు రెండు ప్రధానమైన, సుదూర ప్రాంతాల మధ్య మరో ప్రత్యేక రైలును నిర్వహిస్తుంది. సంబల్‌పూర్-యశ్వంత్‌పూర్ (08301) సువిధ ప్రత్యేక రైలు సంబల్‌పూర్‌లో ఉదయం 11 గంటలకు బయలుదేరి విశాఖపట్నంనకు ఇదే రోజున రాత్రి ఏడు గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ 20 నిమిషాల హాల్ట్ అనంతరం నేరుగా బయలుదేరే ఇది యశ్వంత్‌పూర్‌కు మరుసటి రోజున అంటే గురువారం సాయంత్రం 4.40గంటలకు వెళ్తుంది. ఈ ప్రత్యేక రైలు వచ్చేనెల ఆరవ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు నడువనుంది. ఇదే ప్రత్యేక రైలు యశ్వంత్‌పూ-సంబల్‌పూర్ (08302) మధ్య వచ్చేనెల 8వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు నడువనుంది. ఇది ప్రతి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.30గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి శుక్రవారం రాత్రి 8.35గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖ రైల్వేస్టేషన్‌లో 20 నిమిషాలు హాల్ట్ అనంతరం ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరి సంబల్‌పూర్‌కు శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు చేరుకుంటుంది.ఈ ప్రత్యేక రైలు బర్గార్‌రోడ్డు, టిట్లాఘర్, కెసింగ, రాయగడ, విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట, జోలాపెట్టాయి, కృష్ణరాజుపురం రైల్వేస్టేషన్‌ల మీదుగా ఇది నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలులో సెకండ్ ఏసి-1, థర్డ్ ఏసి-2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-10, సెకండ్ క్లాసులు సిటింగ్-2, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజీ కోచ్‌లు-2 సదుపాయం కల్పించబడ్డాయి.
* భువనేశ్వర్-కృష్ణరాజపురం (08451)
భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ (08451) బై వీక్లీ సువిధ ప్రత్యేక రైలు భువనేశ్వర్‌లో ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 10.50గంటలకు బయలుదేరి మరుసటి రోజున ఉదయం 5.10గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ కేవలం 20 నిమిషాలు నిలుస్తుంది. తరువాత ఇక్కడ నుంచి బయలుదేరే ఇది కృష్ణరాజుపురానికి గురు,ఆదివారాల్లో రాత్రి 11గంటలకు వెళ్తుంది. ఈ ప్రత్యేక రైలు వచ్చేనెల 6వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు నడుస్తుంది. అలాగే కృష్ణరాజుపురం-్భవనేశ్వర్ (08452)ల మధ్య బై వీక్లీ సువిధ ప్రత్యేక రైలు కృష్ణరాజుపురంలో ప్రతి శుక్ర,సోమవారాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత 1గంటలకు బయలుదేరి విశాఖపట్నం అవేరోజుల్లో రాత్రి ఆరు గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ 20 నిమిషాలు హాల్ట్ అనంతరం నేరుగా బయలుదేరి భువనేశ్వర్‌కు శని,మంగళవారాల్లో తెల్లవారుజామున 1.45గంటలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక బ్రహ్మపూర్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టాయిల మీదుగా కృష్ణరాజుపురం చేరుకుంటుంది. దీనిలో సెకండ్ ఏసి-1, థర్డ్ ఏసి కోచ్లు-3, స్లీపర్‌కోచ్‌లు-12, సెకండ్ క్లాస్‌లు-2ల సదుపాయం కల్పించబడింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు గమనించి సద్వినియోగపర్చుకోవాల్సిందిగా సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.యల్వెందర్‌యాదర్ విజ్ఞప్తి చేశారు.