విశాఖ

తూర్పుకాపులకు బిసి సర్ట్ఫికెట్లు రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, జూలై 10: తూర్పుకాపుపేరిట జారీచేసిన బిసి సర్ట్ఫికెట్లను వెంటనే రద్దుచేయాలని, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు తక్షణమే బి.సి సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని రాష్ట్ర బిసి సంఘం ఉపాధ్యక్షులు వియ్యపు భూలోకనాయుడు డిమాండ్ చేశారు. స్థానిక విలేఖర్లతో ఉగ్గినపాలెంలో ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపధికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బ్యాంక్‌రుణాలు మంజూరు చేసి కుటీర పరిశ్రమలకు తోడ్పడలన్నారు. విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్‌లో ఉచితంగా సీట్లు కేటాయించాలని, ప్రభుత్వ, ప్రైవేటు రం గాల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలన్నారు. కాపులను బిసిల్లో చేరిస్తే రాష్టవ్య్రాప్తంగా ఆందోళన చేస్తామని భూలోక నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒక్క కులానికే ప్రభుత్వ వెయ్యికోట్లు కేటాయిస్తే బిసిల్లో ఉన్న ఒకొక్క కులానిక వెయ్యి కోట్లు కేటాయించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. బిసిలకు రావల్సిన సదుపాయాలను ప్రభుత్వం కల్పించకపోతే రాజకీయ పార్టీగా అవతరించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు ఒమ్మి నర్సింగరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మళ్ల కొండబాబు, రాష్టక్రార్యదర్శి పంపనబోయిన వెంకట్రావు, జిల్లా కోశాధికారి దొడ్డి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మొల్లి రమణబాబులు హెచ్చరించారు. వీరి వెంట జిల్లాయువజన విభాగం అధ్యక్షులు వేగి త్రినాథ్, ప్రధాన కార్యదర్శి కరక సోమునాయుడు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె అప్పారావు ఉన్నారు.