విశాఖ

ఐటిడిఎ పిఒ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 22: పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. విశాఖపట్నం గ్రేటర్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఆయనను ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిగా ఇంకా ఎవరినీ నియమించలేదు. పాడేరు సబ్ కలెక్టర్ లోతేటి శివశంకర్‌కు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐ.టి.డి. ఎ. ప్రాజెక్టు అధికారిగా వేరేవారిని నియమించేవరకు పూర్తి బాధ్యతలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత సంవత్సరం జనవరి 19వ తేదీన ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన హరినారాయణన్ 18 నెలల మూడు రోజుల పాటు గిరిజనులకు విశిష్ట సేవలు అందించి తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నారు. ప్రభుత్వ విభాగాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆయన ప్రధానంగా దృష్టిసారించి ముఖ్యమైన విభాగాలలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి ఆయా పోస్టులలో వారిని తప్పించడం ద్వారా అవినీతిని కొంత వరకు ప్రక్షాళన చేయగలిగారని చెప్పవచ్చు.గిరిజన సంక్షేమ విద్యా రంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి ఎప్పటినుంచో కొనసాగుతున్న డిప్యూటీ వార్డెన్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం హరినారాయణన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రాజెక్టు అధికారిగా ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పలువురి గిరిజనులకు ప్రాణబిక్ష పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. మృత్యువుతో పోరాటం చేస్తూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని గిరిజనులకు లక్షల రూపాయలను వెచ్చించి వారికి కార్పోరేట్ ఆసుపత్రులలో చికిత్సలు చేయించి ఎందరినో ప్రాణాలతో కాపాడిన మానవతావాదిగా హరినారాయణన్‌ను పేర్కొనవచ్చు. గిరిజనుల పట్ల హరినారాయణన్ చూపిన ఆదరణతో ఆదివాసులలో మంచి గుర్తింపును పొందగలిగారని చెప్పవచ్చు. అయితే విధి నిర్వహణలో కచ్చితత్వం, నిజాయితీ పనితీరు వలన హరినారాయణన్ వ్యవహార శైలి అక్రమార్కులైన అధికార, ఉద్యోగ వర్గాలలో వ్యతిరేకతకు కారణమయ్యింది. అక్రమార్కులలో ఆయన పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నా గిరిజనులకు సేవ చేసే అధికారిగా ఆయన ఈ ప్రాంత వాసుల మన్ననలు చూరగొన్నారనే చెప్పవచ్చు.