విశాఖ

సుజల స్రవంతి ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో తీర్మానం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూలై 24: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించేందుకు అనువుగా రాష్ట్ర క్యాబినెట్‌లో తీర్మానం జరగాలని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు.ఈ విషయమై జిల్లామంత్రులు, ఎమ్మెల్యేలను కలసి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తానన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన విధంగా ప్రత్యేక ప్యాకేజీకి 1500 కోట్ల నిధులను కేటాయించాలని కోరుతూ ఢిల్లీలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలను కలసి కోరానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రులకు సైతం ఈ విషయమై అభ్యర్ధన చేసానన్నారు. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల విధానంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని విశాఖజిల్లా పర్యటనలో చంద్రబాబు ప్రకటించడం అభినందనీయమన్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రక్రియ అమలులోకి రావాలని తద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన దాదాపు పదివేల ఎకరాల పంటభూములకు అదనంగా సాగునీటి సదుపాయం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీతోపాటు సుజల స్రవంతి ప్రాజెక్టును తక్షణమే అమలు చేస్తే తాగునీరు, సాగునీరు అందడంతోపాటు పరిశ్రమలకు నీటికొరత ఉండబోదన్నారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు విశాఖజిల్లాలో మండలాల వారీగా పర్యటనకు శ్రీకారం చుట్టామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మేథావులను కూడా కలుస్తామన్నారు.