విశాఖ

ప్రతిపక్షాల ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణం, ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగాను, సంపూర్ణంగాను జరిగింది. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అన్నివర్గాల వారు స్వచ్చందంగా తమ వ్యాపారాలను ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. వైఎస్సాఆర్ సిపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్‌ఆద్మీ తదితర రాజకీయ పక్షాల నేతలంతా తెల్లవారు నుండే ఆర్టీసి కాంప్లెక్స్‌కు చేరుకుని బస్సులు తిరగకుండా అడ్డుకుని బంద్‌ను అమలు చేసారు. పట్టణంలో పర్యటించి బంద్‌ను సమీక్షించారు. బంద్ సందర్భంగా కాంప్లెక్స్ నుండి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. పట్టణంలోని అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయి. బంద్ సందర్భంగా పట్టణంలో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. మెయిన్‌రోడ్డుపై బైఠాయించి బంద్‌ను అమలు చేస్తున్న వివిధ రాజకీయ పక్షాల నేతలను, కార్యకర్తలను పోలీసులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఈ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అరెస్టయిన పోలీస్ స్టేషన్‌లోని నిరసనకారులను పరామర్శించి అక్రమ అరెస్టులను ఖండించారు. ఆందోళనకారులనుద్ధేశించి కాంగ్రెస్ నేత దంతులూరి దిలీప్‌కుమార్, పట్టణ వైఎస్సాఆర్ సిపి అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, పట్టణ వైఎస్సాఆర్ సిపి యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు తదితరులు ప్రసంగించారు. ఉభయ కమ్యునిస్టుపార్టీలు, ఆమ్‌ఆద్మీ పార్టీల నేతృత్వంలో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో ఉద్ధేశించి సిపిఎం నాయకులు మళ్ల సత్యనారాయణ, పట్టణ సిపిఐ కార్యదర్శి వైఎన్ బద్రం, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత కొణతాల హరినాథ్‌బాబు, కోన లక్ష్మణ తదితరులు ప్రసంగించారు. వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు భీశెట్టి కృష్ణ అప్పారావు, కొణతాల శ్రీనివాసరావు, మండల వైఎస్సాఆర్ సిపి అధ్యక్షులు గొర్లి సూరిబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి లోకనాథం, మాజీ కౌన్సిలర్ నట్టాల మురళీ, నిమ్మకాయల నర్సింహమూర్తి, ఎంపీటిసి శరగడం నాగేశ్వరరావు తదితరులు ఈ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారు. టౌన్ సిఐ విద్యాసాగరరావు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న నిరసనకారులను పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సొంత పూచీకత్తులపై విడుదల చేసారు.