విశాఖ

వుడా ఆదాయం రూ. 123 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 11: దాకమర్రి లే అవుట్ సహా వివిధ లే అవుట్లలోని ఆడ్ బిట్లను అమ్మడం ద్వారా విశాఖ నగరాభివృద్ధి సంస్థకు 123.3 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. చివరి రోజైన గురువారం ఒక్కరోజే 21 కోట్ల రూపాయల ఆదాయం లభించడం గమనార్హం. వివిధ లే అవుట్లలోని ఆడ్ బిట్లకు వుడా గురువారం వేలం పాటలను నిర్వహించింది. 41 ప్లాట్లలో 31 ప్లాట్లు అమ్ముడు పోయాయి. దీని ద్వారా 21 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మధురవాడలో చదరపు గజం ప్రారంభ ధరగా 27 వేల రూపాయలు నిర్ణయించగా, గరిష్టంగా 34500 రూపాయలకు దక్కించుకున్నారు. శొంఠ్యాంలో 6000 రూపాయలు ప్రారంభ ధర కాగా, 15500 రూపాయలకు దక్కించుకున్నారు. కాపులుప్పాడలో 12500 రూపాయలు ప్రారంభ ధర కాగా, 15000 రూపాయలకు అమ్ముడు పోవడం గమనార్హం. వుడా ప్లాట్లకు వివాదాలు ఉండకపోవడంతో ఎక్కువ మంది ఈ ప్లాట్లపై ఆసక్తి కనబరుస్తున్నారు.