విశాఖ

ఏడాదిలోగా బిఆర్‌టిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఆగష్టు 17:ఈ ఏడాదిలోగా జె ఎన్ ఎన్ యూ ఆర్ ఎం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని జివిఎంసి కమిషనర్ హరినారాయణ అన్నారు. ఈ నేపథ్యంలోనే అసంపూర్తిగా మిగిలిపోయిన బి ఆర్ టి ఎస్ రహదారి పనులు పూర్తి చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన పాతఅడివివరం- గోశాల మధ్య విస్తరణకు నోచుకోని రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. సుమారుగా రెండు కిలోమీటర్ల విస్తరణ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక్కడ నివాశితులతో ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు, అధికారులు చర్చలు జరిపి ప్రత్యామ్మాయంపై నిర్ణయం తీసుకున్నారని, దానికి అనుగుణంగా ముందుకు వెళతామని కమిషనర్ చెప్పారు. 50 శాతానికి మించి నష్టపోయేవారికి ప్రత్యామ్నాయ స్థలాలు అందిస్తామన్నారు. ఈ ప్రక్రియ చేపట్టేలోగా ఖాళీగా ఉన్న స్థలాల్లో తక్షణమే పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేసారు. అభ్యంతరాలు లేని ప్రదేశాల్లో విస్తరణ చేపడతామని ఆయన చెప్పారు. కాగా పాత అడివివరం నుండి భైరవవాక వరకు 200 అడుగుల రహదారి విస్తరణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు జి వి ఎం సి మాస్టర్ ప్లాన్‌లో ఇది వరకే ఉన్న ప్రతిపాదనలను అధికారులు తెరపైకి తీసుకువచ్చారు.