విశాఖ

పూర్తి వివరాలతో బోర్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఆగస్టు 30 :శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో బోర్డుల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. దళారులను నమ్మి ప్రజలు మోసపోకుండా దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇప్పటికే చాలా స్థలాల్లో బోర్డులను దేవస్థానం ఏర్పాటు చేసింది.1996 రెవిన్యూశాఖ దేవస్థానానికి పట్టాలిచ్చిన 9వేల 69 ఎకరాలకు చెందిన పంచగ్రామాల్లోని భూములలో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అడివివరం, వేపగుంట, చీమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురం గ్రామాల్లో ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంతెంత భూమి ఉంది అన్న సమాచారాన్ని కచ్చితంగా బోర్డుల్లో రాసిపెట్టారు.
దీని వలన ప్రజలకు అవగహన కలగడంతో పాటు స్పష్టమైన వివరాలు తెలుస్తాయని ఈవో రామచంద్రమోహన్ తెలియజేసారు. ఈనేపథ్యంలో ప్రజలెవరూ భూముల కొనుగోలు విషయంలో మోసపోయే అవకాశం ఉండదని ఆయన అన్నారు. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు దేవస్థానం కార్యాలయం, సింహగిరిపైన భూముల వివరాల బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.