తూర్పుగోదావరి

ఆద్యంతం వినోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, ఏప్రిల్ 7: కోనసీమ ఉత్సవాల రెండవ రోజైన గురువారం సాయంత్రం ప్రధాన వేదికపై సినీ ప్రముఖులు, గాయనీ గాయకులు ఎంఎం శ్రీలేఖ, సఖిత, రఘువరన్, వౌనిమ సీనీ గీతాలతో ప్రేక్షకులను ఆనందోత్సాహాలతో ముంచెత్తారు. యాంకర్లు రవి, లాస్యలు వారి మాటలతో ప్రేక్షకులను కుడుపుబ్బా నవ్వించారు. అబూసలెం టీం ప్రత్యేక నటనతో యువతను ఉర్రూతలూగించారు. అనంతరం స్పెషల్ డ్యాన్స్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రేక్షకులు తప్పట్లతో మరింత ఉత్సాహాన్ని, జోష్‌ను పెంచారు. ఈ సందర్భంగా యాంకర్ రవి ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని కార్యక్రమాలను వీక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యేలు పులపర్తి నారాయణమూర్తి పేర్లు ఉచ్చరిస్తూ జడ్పీ ఛైర్మన్ పేరును గొల్లపల్లి సూర్యారావు అని చెప్పడంతో నాయకులు, ప్రేక్షకులు ఒక్కసారిగా అశ్చర్యం వ్యక్తం చేసారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆలియాస్ బుచ్చిబాబు అని చెపుతూ కోనసీమ ఉత్సవాల్లో గౌతమీ నదీతీరంలో సినీ గాయకులకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు చల్లని వాతావరణంలో గడుపుతూ ఆనందాన్ని, అహ్లాదాన్ని పొందుతూ కేరింతలు కొట్టడంతో కోనసీమ ఉత్సవాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గోదావరిలో రంగుల తెరచాపలతో ఏర్పాటు చేసిన పడువలు, రాఘవేంద్రవారిధిపై లేజర్ కాంతులు చిన్నారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ప్రధాన వేధిక వద్ద బాణా సంచా కాల్పులు మెరుపులతో ప్రాంగణం మరింత కళకళలాడింది. ఉదయం పూట ఎండవేడిమి ఎక్కువుగా ఉన్నందున సందర్శకుల తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం 5 గంటల నుండి 10.30 వరకూ సందర్శకుల తాకిడి పెరగడంతో ప్రాంగణం కిక్కిరిసింది. ఈ కార్యక్రమాలతో పాటు ముమ్మిడివరం కళాసాహితి ఆధ్వర్యంలో సినారే కవి సమ్మేళనం ప్రేక్షకులను అమితంగా ఆకర్శించింది. కవి సినారే యుగాది విశిష్ణత, తెలుగు గొప్పతనాన్ని చాటేవిధంగా కవితలు వినిపించారు. అలాగే వివిధ కళారూపాలు వృద్ధ గౌతమీ ఒడ్డున ప్రదర్శనలు, నృత్యం, నమూనా దేవాలయాలు దగ్గర సంగీత కార్యక్రమాలు, తోలుబొమ్మలు విశేషంగా ఆకర్శించాయి. ఈ కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, పులపర్తి నారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యరావు, జెడ్‌పిటిసి నాగిడి నాగిడి నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, బీర సత్యకుమారి, చెల్లి అశోక్, మురమళ్ళ సర్పంచ్ చెయ్యేటి శ్రీను పాల్గొన్నారు.
నేటి నుండి 18వ రాష్టస్థ్రాయి ఆహ్వాన నాటక పోటీలు
రావులపాలెం, ఏప్రిల్ 7: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెం సిఆర్సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే 18వ రాష్టస్థ్రాయి ఆహ్వాన నాటక పోటీలు శుక్రవారం సాయంత్రం నుండి ప్రారంభమవుతాయని సిఆర్సీ అధ్యక్షుడు నందం వీర వెంకట సత్యనారాయణ, కార్యదర్శి తేతలి నారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం సిఆర్సీలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు పోటీల వివరాలను తెలిపారు. సమాజంలోని సమస్యలను ఎత్తిచూపేందుకు పూర్వం నాటికలు ఎంతగానో దోహదపడేవన్నారు. ఎంతో సామాజిక స్పృహ కలిగిన నాటక రంగం మరుగున పడకుండా ఉండేందుకు సిఆర్సీ తనవంతుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ గత 18 ఏళ్లుగా నాటక, నాటిక పోటీలను నిర్వహిస్తోందన్నారు. ఈ ఏడాది 8,9,10 తేదీల్లో మూడు రోజులు తొమ్మిది హాస్య నాటికలు ప్రదర్శితమవుతాయన్నారు. 8వ తేదీ హైదరాబాద్ కళాంజలి వారి ‘ఇల్లాలి ముచ్చట్లు’, కొలకలూరు కళాలయ వారి ‘ఎంతో చిన్నది జీవితం’, తూర్పు గోదావరి జిల్లా దివిలి శ్రీ శారదా ఆర్ట్స్ వారి ‘్భలే నాటకం’ నాటికలు ప్రదర్శితమవుతాయన్నారు. 9న హైదరాబాద్ శ్రీ మురళీ కళా నిలయం వారి ‘వార్నీ.. అదా విషయం’, గుంటూరు శ్రీ గణేష్ ఆర్ట్స్ థియేటర్స్ వారి ‘అంతా మన సంచికే’, చిలకలూరిపేట ది అమెచ్యుర్ డ్రమెటిక్ అసోసియేషన్ వారి ‘తగునా ఇది భామా!’ నాటికలు, 10వ తేదీన హైదరాబాద్ మల్లాది క్రియేషన్స్ వారి ‘గంతకు తగ్గ బొంత’, హైదరాబాద్ ఆర్ట్ ఫాం క్రియేషన్స్ వారి ‘తస్మాత్ జాగ్రత్త’, విజయవాడ యంగ్ థియేటర్స్ ఆర్గనైజేషన్స్ వారి ‘ఖేల్ ఖతమ్, దుకనామ్ బంద్’ నాటికలు ప్రదర్శిస్తారన్నారు. వీటితోపాటు ఆఖరిగా సిఆర్సీ కళాసమితి సభ్యులు ఆనందోబ్రహ్మ ప్రత్యేక ప్రదర్శన ఇస్తారన్నారు. పెద్దయెత్తున కళాభిమానులు తరలివచ్చి ఈ పోటీలు తిలకించాలని వారు కోరారు. అలాగే సిఆర్సీ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కళా వెంకట్రావు సెంటర్లో పోలీస్ స్టేషన్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే పేదలకు ఉచిత సేవలు అందించేందుకు 24 గంటల అంబులెన్సు సర్వీసును కూడా ప్రారంభిస్తామన్నారు. అలాగే ఉగాది సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం జిల్లాస్థాయి చిత్రలేఖనం, రంగవల్లులు, గోరింటాకు పోటీలు జరుగుతాయన్నారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. సాయంత్రం 4 గంటలకు దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం జరుగుతాయన్నారు. సినీ నటుడు ఎల్‌బి శ్రీరామ్‌చే అయ్యగారి జోగి సోమయాజులుకు పండిత సత్కారం, తనికెళ్ల భరణి చేతుల మీదుగా ప్రముఖ నటుడు, దర్శకుడు కెకెఎల్ స్వామికి సిఆర్సీ కాటన్ కళాపురస్కారం అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో కళాపరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, సిఆర్సీ జాయింట్ సెక్రటరీ కర్రి శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ ఆర్‌విఎస్ రామాంజనేయరాజు, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి పాల్గొన్నారు.