వరంగల్

జనవరిలోగా వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 22: వరంగల్ నగర సమగ్రాభివృద్ధి కోసం చేపడుతున్న మాస్టర్ ప్లాన్ తయారీ వచ్చే జనవరిలోగా పూర్తవుతుందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తెలిపారు. మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే కుడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ అనుమతులు ముమ్మరంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మంగళవారం కుడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న లీ అసోసియేట్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి కుడా చైర్మన్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతు దశాబ్ధాల కిందటి మాస్టర్ ప్లాన్ కారణంగా లేఔట్లకు, ఎల్‌ఆర్‌ఎస్ అనుమతులకు తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. 2014లో కొత్త మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రయత్నాలు జరిగినా ఔటర్ రింగురోడ్డు మంజూరు కావటం, టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలు రావటం, అండర్ డ్రైనేజీ నిర్మాణానికి అనుమతులు రావటం, శివారు గ్రామాలు విలీనంతో నగర పరిధి పెరగటంతో ఆ ప్రయత్నాలను నిలిపివేసి తాజాగా పెరిగిన విస్తీర్ణణ, భవిష్యత్తు అవసరాల మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసే పనులను లీ అసోసియేట్స్ సంస్థ దక్కించుకుందని, ఈ సంస్థ వరంగల్ నగరంలో తన కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని గత రెండునెలలుగా కార్యకలాపాలను ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు,స్వచ్చంధ సంస్థలు, వివిధ రంగాలలో నిపుణులైన కొందరు వ్యక్తులతో మాస్టర్‌ప్లాన్ గురించి చర్చించేందుకు లీ అసోసియేట్స్ నిర్ణయించిందని, ఇప్పటికే కొందరి అభిప్రాయాలను తెలుసుకుందని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకుని, వాటిని క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేస్తుందని, కుడా, నగరపాలక సంస్థ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి పంపించి అవసరమైన సూచనలతో వచ్చే జనవరిలోగా మాస్టర్ ప్లాన్ తయారు పూర్తిచేస్తుందని అన్నారు. పాత మాస్టర్‌ప్లాన్ కారణంగా నగర పరిధిలో వివిధ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయటం, ఎల్‌ఆర్‌ఎస్ కార్యక్రమంలో అనుమతులు మంజూరు చేయటం కుడాకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం అయితే ఈ సమస్యలు తీరిపోతాయని చెప్పారు.