వరంగల్

పదివేల మంది బాలికలతో ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జనవరి 22: జనగామ మినీస్టేడియంలో పదివేల మంది బాలికలతో వినూత్న తరహాలో మార్షల్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జనగామ కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. ఆదివారం పట్టణంలోని సంజయ్‌నగర్ మినిస్టేడియంలో బాలికలతో ‘సంఘటిత సబల’ సామూహిక ప్రదర్శన నిర్వహించుటకు చేస్తున్న ఏర్పాట్లను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని 10వేల మంది బాలికలతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సమాజంలో మహిళలు, యువతులు, బాలికా విద్యార్థినుల్లో ప్రేరణ శక్తిని పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ షీటీమ్స్ కరాటే మాస్టర్ ఎస్. లక్ష్మీ, వి. రవిల పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నెలరోజుల పాటు 172 వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో 13 నుంచి 18 సంవత్సరాల బాలికల విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు, 500మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు, 3వేల మంది ప్రయివేట్ విద్యార్థులకు సెల్ఫ్ డెఫెన్స్ షీటీమ్ కరాటే మాస్టర్ ద్వారా శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. ఈ శిక్షణను మరిచిపోకుండా నిరంతరాయంగా జరిగే విధంగా సంబంధిత పిఇటిలకు ఆయా పాఠశాలల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థినులతో పాటు సమాజంలో మహిళలందరు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందన్నారు. ఈ నెల 24న విద్యార్థినులతో మార్షల్ ప్రదర్శన నిర్వహించుటకు సంబంధిత అధికారులు జిల్లాలోని 13 మండలాల్లోని బాలికలను ఆయా పాఠశాలల నుంచి వివిధ రూట్ మ్యాప్‌ల ద్వారా స్టేడియంకు తరలించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మినిస్టేడియం వద్ద విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా తాత్కాలిక టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్టేడియంలోకి వచ్చే గేట్ల వద్ద కౌంటింగ్ మిషన్‌లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా విఐపిలు, బాలికలు మిని స్టేడియంకు వేర్వేరుగా వచ్చే విధంగా మార్గాలను నిర్ణయించాలని అధికారులను కోరారు. గ్రామాల నుంచి విద్యార్థినులను తీసుకొచ్చే బస్సులకు పార్కింగ్ స్థలాలను గుర్తించి, అట్టి స్థలాలకు వెళ్లే విధంగా మార్గాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. జిల్లాలో మొదటిసారిగా ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. డిసిపి తేజావత్ వెంకన్న మాట్లాడుతూ జిల్లాలో వినూత్న తరహాలో బాలికలతో ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమానికి 8మంది సిఐలు, 20మంది ఎస్సైలు, 150మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఆర్టీసి డిపో మేనేజర్ శ్రీనివాస్, ఎసిపి పద్మనాభరెడ్డి, వార్డు కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, స్కౌట్ మాస్టర్స్ ఎన్. లక్ష్మీ, వి. రవి తదితరులు పాల్గొన్నారు.