వరంగల్

గ్రామాలను అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి,జనవరి 23:ప్రతి అధికారి జిల్లాలోని ఒక్కొ గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామ సమగ్ర అభివృద్దికి కృషి చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల టిజిఓ సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని, తెలంగాణ ఉద్యమంలో జిల్లా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కీలక పాత్ర పోషించారని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని అన్నారు. అధికారులు ప్రజలకు సేవలు అందించాలని, ఎన్నో ఆశలతో ఉన్న ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. అర్బన్ కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ ఉద్యోగులు మూస పద్దతిని వీడి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగాలని అన్నారు.

టైర్ల రిట్రేడింగ్ కర్మాగారాన్ని తరలించవద్దు
వడ్డేపల్లి,జనవరి 23:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాకు ఒక కొత్త పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న చిన్న చిన్న పరిశ్రమలను వేరే జిల్లాలకు తరలిస్తూ, మిగతా పరిశ్రమలను ఎత్తివేయడం దారుణమని బిసి జెఎసి రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని రోడ్డు రవాణా సంస్థకు సంబందించి టైర్ల రిట్రేడింగ్ పరిశ్రమను ఎత్తివేసే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా శేషు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఉత్తమ సేవల అవార్డును పొంది ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థను ఎత్తివేయాలనే ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సేవలు అందిస్తున్న సంస్థనుండి నల్గొండను తొలగించి, సంస్థను కరీంనగర్‌కు తరలించాలనే ప్రయత్నం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రిట్రేడింగ్ పరిశ్రమ పరిథిలోగల విలువైన ప్రభు త్వ భూములను స్వాధీనం చేసుకునేందుకే సంస్థను తరలిస్తున్నారని ఆరోపించారు. ఒక వేళ సం స్థను తరలిస్తే సంస్థ పరిథిలోగల ప్రభుత్వ భూములను పేద ప్రజలకు ఇండ్ల స్థలాలుగా పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంస్థ ఎత్తివేతను నిలిపివేయని పక్షంలో అన్ని కార్మిక సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నాయకులు సురేందర్, విజయ్, ప్రసాద్, శ్రీనివాస్, సతీష్, వినయ్ పాల్గొన్నారు.