వరంగల్

సీఎం గొప్ప మానవతావాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాయంపేట, జనవరి 24: ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప మానవతావాదని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. మంగళవారం శాయంపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆర్‌డిఓ మహేందర్‌జి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా స్పీక ర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 17మంది లబ్దిదారులకు రూ.51 వెయ్యి చొప్పున, రూ. 8.60 లక్షలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు పెళ్లి చేయడం భాద్యత. దాని నిర్వర్తించడంలో పేదరికంతో కొందరు, భారంతో మరికొందరు పడుతున్న అవస్థలను గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడపిల్లల పెళ్లి బాధ్యత తీసుకున్నారని పేర్కొన్నారు. కన్న తల్లిదండ్రులకు ఆడపిల్ల భారంగా భావించకుండా రూ.51వెయ్యి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆడపిల్ల జన్మించిన ప్రతి ఇంటిలో లక్ష్మిదేవతగా భావించే విధంగా కెసిఆర్ కల్యాణ లక్ష్మి ద్వారా భరోసా కల్పించారని కొనియాడారు. కన్న తల్లిదండ్రులపై ఆదర ణ చూపలేని వారు సమాజంలో ఉండకూడదని, వారికి జీవితాలకు రుణపడి ఉండాలని కోరారు. ప్రతి ఇంటికి అమ్మకు పెన్షన్, ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, చదువుకుంటున్న పిల్లలు పోటీ ప్రంపంచంలో రాణించాలనే ఉద్దేశం తో రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా కెసిఆర్ వ్యవహరించి ఆర్ధిక సహాయం అందించారని పేర్కొన్నారు. పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి బాసని రమాదేవి, జెడ్పిటిసి వంగళ రమాదేవి, తహశీల్దార్ రజిని, ఎంపిడిఓ రమాదేవి, సర్పంచ్ వల్పదాసు చంద్రవౌళి, ఎంపిటిసి కందగట్ల రవి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్ పాల్గొన్నారు.

ఆడపిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలి
* అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి

వరంగల్, జనవరి 24: ఉన్నత చదువులతో ఆడపిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి సూచించారు. చదువు అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అర్బన్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించేందుకు బాలికలు కృషిచేయాలని సూచించారు. తాత్కాలిక అవసరాలు, సౌకర్యాల కోసం వెంపర్లాడ కూడదని తెలిపారు. చదువుకుంటే అన్ని రంగాలలో సమానత్వం సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అవకాశం వస్తే పాఠశాలలో, ఇతర ప్రదేశాలలో ఆయా అంశాలపై నిర్భయంగా మాట్లాడాలని, దీనివల్ల పిరికితనం పోయి ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని చెప్పారు. నగరంలో పోలీసు కమీషనరేట్ ఆధ్వర్యంలో షీ-టీంలు ఆత్మరక్షణ కోసం నిర్వహిస్తున్న శిక్షణలో పాల్గొని మెళుకువలు నేర్చుకోవాలని చెబుతూ, ఈ కార్యక్రమం అన్ని పాఠశాలలకు విస్తరించాలని అభిప్రాయం వ్యక్తం చేసారు. మహిళలలు సమస్యల పరిష్కారం కోసం తనను సంప్రదించవచ్చని తెలిపారు.