వరంగల్

రైతు సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి,్ఫబ్రవరి 20: రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేసి ప్రతిపక్ష నాయకుల గొంతులను నొక్కేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తు టిడిపి అధ్వర్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు సోమవారం దర్నా కార్యక్రమం చేపట్టారు. గత మూడురోజుల నుండి మార్కెట్ ఎదుట దీక్షలు చేపట్టేందుకు ప్రభుత్వం నుండి అనుమతి పొందామని తెలిపినా కూడ పోలీస్‌లు అనుమతి లేదనే నెపంతో దీక్షను చేపట్టకుండ భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసులకు టిడిపి నాయకులకు కొద్ది సేపు వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ రైతుల పండించిన మిర్చి, కంది పంటలకు గత సంవత్సరంతో పోలిస్తే ధరల వ్యత్యాసంలో మార్పులు చాలా ఉన్నాయని తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మిర్చి క్వింటాల్‌కు 12 వేల రూపాయలు ఉంటే నేడు 8 వేల రూపాయలకు పడిపోయిందని, అదేవిధంగా కంది గత ఫిబ్రవరిలో 8 వేల రూపాయలు ఉండగా నేడు 4వేల రూపాయలకు దిగజార్చి రైతులో నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రైతులకు కనీస మద్దతు ధర కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పిన కెసిఆర్, నేడు రైతుల సమస్యలపై మతిమరుపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. ఒక్క పక్క సంపన్న రాష్ట్రం అని చెప్పుకుంటూనే మరో పక్క రైతు రుణమాఫిని విడతల వారి పేరుతో నీరు కార్చారని, పైగా రుణమాఫి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన పంటలకు లాభాలు లేక నష్టాల పాలయ్యారని, పంటల కోసం చేసిన రైతుల బ్యాంకుల అప్పులను రద్దు చేస్తామన్న ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని టిడిపి అధికార ప్రతినిధి వేం నరేందర్ రెడ్డి అన్నారు. అన్ని రకాల సరుకుల ధరలు మార్కెట్‌లో ఏడాదికేడాది చుక్కలంటుతుంటే, రైతు పంటలకు మాత్రం గిట్టు బాటు ధరలు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గిట్టు బాటు ధరల పేరుతో రైతులకు కంటి తుడుపు చర్యలతో రైతుల కన్నిటిని ఆపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాలు మిర్చికి 10వేలు, కందులకు 8వేల రూపాయల కనీస మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతు ఆత్మహత్యల నివారణకు శాస్వత చర్యలు చేపట్టి ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 6లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాలని, రైతు రుణాలను ఏక కాలంలో వడ్డీతో సహా మాఫి చేసి కొత్త రుణాలను ఇవ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు వ్యవసాయ పంటల అన్నింటికీ కనీస మద్దతు ధరలు చెల్లించాలని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులను పోలీసులు అరెస్టు చేసి మిల్స్ కాలని, ఇంతేజార్‌గంజ్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో గండ్ర సత్యనారాయణరావు, గన్నోజు శ్రీనివాస చారి, కక్కెర్ల సారయ్య, జాటోత్ ఇందిరా, మాదాసు బాబు, ఈశ్వర్, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.