వరంగల్

7 నుండి 10వ తరగతి పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 16: వరంగల్, జనగామ, భూపాల్‌పల్లి, మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల 17 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభకానున్నాయి. 17 నుండి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. టెన్త్ పరీక్షల ఏర్పాట్ల కోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మొత్తం 50సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 10,120మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకానున్నారు. అందులో 4902మంది బాలురు, 5218మంది బాలికలతోపాటు మరో 63మంది వన్స్ ఫెయిల్ విద్యార్థులు హాజరుకానున్నారు. అందుకోసం జిల్లాలో 49పరీక్షా కేంద్రాలను రెగ్యులర్ విద్యార్థుల కోసం, ఒక పరీక్షా కేంద్రాన్ని ఫెయిల్డ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, ట్యూబ్‌లైట్స్, ఫ్యాన్‌లు కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లు అందించేందుకు ఏఎన్‌ఎంలను కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా సమయం కంటే ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9.30గంటల నుండి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అయితే హిందీ సబ్జెక్ట్ మాత్రం ఉదయం 9.30గంటల నుండి మధ్యాహ్నం 2.15గంటల వరకు ఉంటుంది. పరీక్షా హాల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా వారి తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. హాల్‌టికెట్ అందని విద్యార్థులు ఇంటర్‌నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్ ద్వారా పొందిన హాల్‌టికెట్‌పై ప్రధానోపాద్యాయుడి సంతకం లేకున్నా అనుమతిస్తారు. విద్యార్థులు వారి వెంట ఎగ్జామ్‌ప్యాడ్, పెన్, పెన్సిల్, ఎరేజర్ వంటివి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.
పరకాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పదో తరగతి వార్షిక పరిక్షలు రాసే విద్యార్థుల కోసం జిల్లాలో మొత్తం 44 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 242 హైస్కూళ్ల నుంచి 8,236 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్ష కొనసాగుతుందని, అత్యవసరమైతే 5 నిమిషాలు సడలింపు ఇస్తామని అంతకంటే అలస్యంగా వస్తే అనుమతించేది లేదని అధికారులు తెలిపారు.
479 మంది ఇన్విజలేటర్ల నియామకం...
పదో తరగతి వార్షిక పరీక్షలకు 479 మంది ఇన్విజలేటర్లను నియమించినట్లు భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జ్ డిఈవో నారాయణరెడ్డి తెలిపారు. పరీక్షల అబ్జర్వులుగా ప్రత్యేక అధికారిగా సారంగపాణి అయ్యంగార్, అసిస్టెంట్ కమిషనర్‌గా చంద్రవౌళి వ్యవహరిస్తారని చెప్పారు. పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే అదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు కూడా సెల్‌ఫోన్లు పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లవద్దన్నారు. ఒక వేళ తీసుకెళ్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంచార్జ్ డిఈవో నారాయణరెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షా సమయాల్లో సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలన్నారు. లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
*్ఫర్యాదుల కోసం భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు...

ఫిర్యాదుల కోసం భూపాలపల్లిలో కంట్రోల్ రూం నెంబర్ 08713-222374ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంచార్జ్ డిఈవో నారాయణరెడ్డి తెలిపారు. పరీక్షా పత్రాల నిల్వ కోసం జిల్లాలో మొత్తం 17 స్టోరేజి పాయింట్లను(పోలీస్ స్టేషన్లు) ఏర్పాటు చేశామన్నారు. సి కేటగిరి సెంటర్లు జిల్లాలో ఆరు ఉన్నాయన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏఎన్‌ఎంలతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారి శ్రీలత, కృష్ణమోహన్, చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.
పరీక్షల దృష్ట్యా 144 సెక్షన్ అమలు
*సిపి సుధీర్‌బాబు
నక్కలగుట్ట,మార్చి 16:వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిథిలో వరంగల్ అర్బన్, రూరల్, జనగాం జిల్లాలలో పదవ తరగతి పరీక్షలతో పాటు డిగ్రీ పరీక్షలు కూడా జరుగుతున్నందున శుక్రవారం నుండి వచ్చే నెల 15 వరకు 144 సెక్షను అమలులో ఉంటుందని సిపి సుధీర్‌బాబు గురువారం తెలిపారు. కమీషనరేట్ పరిథిలో ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 12.30గంటల వరకు పదవతరగతి పరీక్షలు, అదే విధంగా జనగాం జిల్లాలో ఉదయం 8.30 నుండి 5.30 వరకు పరీక్షలు నిర్వహంపబడుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు 144 సెక్షన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. 144 సెక్షన్ అమలు చేయడం ద్వారా నగరంలో పోలీసు అధికారుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం నిషేధించబడినాయని తెలిపారు. పరీక్షలు నిర్వహించే సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
నేటి నుండి పదవతరగతి పరీక్షలు
*పూర్తయిన ఏర్పాట్లు

ములుగుటౌన్, మార్చి 16 : పదవతరగతి పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ములుగు కేంద్రంగా ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు గురువారం తెలిపారు. మండలంలోని మల్లంపల్లి జెడ్పిఎస్‌ఎస్, ములుగులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలురు, బాలికల పాఠశాలలు, బండారుపల్లి మోడల్‌స్కూల్‌లలో పరీక్షా కేంద్రాల నిర్వహణ జరుగుతుందని అన్నారు. మొత్తం ఈ ఐదు కేంద్రాల్లో 916మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థిని విద్యార్థుల సౌకర్యార్థం ఆయా పరీక్షా కేంద్రాల వద్ద మంచినీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.