వరంగల్

ఒసిలను విస్మరించడం బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మార్చి 17: 3వేల కోట్లతో ఓసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ఓసి సంక్షేమ సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పరకాల పట్టణంలోని స్వర్ణగార్డెన్స్‌లో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన్నారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓసి వర్గీయులైన పేదల సంక్షేమాన్ని విస్మరించడం బాధాకరమన్నారు. ఓసిలలో తినడానికి తిండి లేని వారు ఎందరో పేదలున్నారని వారికి చేయడానికి పని దొరకక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అగ్రకులస్తుల్లోని పేదలందరికి వర్తింప చేసి సమన్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కామిడి సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఓసిల స్థితిగతుల అధ్యాయనికి చట్టబద్థతతో కూడిన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. రూ. 3వేల కోట్లతో ఓసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించి స్వయం ఉపాధి పథకాల కోసం 80శాతం రాయితీతో కూడిన రుణాలు ఓసి పేదలకు అందించి అర్థిక చేయూత నివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఓసి సంక్షేమ సంఘాల సమాఖ్య నేతలు బూచి ప్రభాకర్‌రెడ్డి, కామిడి రత్నాకర్‌రెడ్డి, చల్లా రవీందర్‌రెడ్డి, ఎర్రం సదాశివశంకర్, తనుకు సుధాకర్, చల్లా సమ్మిరెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాసరావు, వినయ్, శ్రీరాం రవీందర్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.