వరంగల్

చెరువుల్లో నీరేదీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, మార్చి 26: ఈ ఏడాది (2016 ఖరీఫ్ సీజన్) సమృద్దిగా వర్షాలు కురినప్పటికి, మండలంలోని చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. మండల కేంద్రంలోని పెద్దచెరువు, గణేష్‌కుంట చెరువు, ఓంపల్లి చెరువు, దయ్యాలకుంట చెరువు, మండలంలోని రొయ్యూరు మాటుకుంట చెరువు, కన్నాయిగూడెం మండల కేంద్రంలోని పాడేరు చెరువులతోపాటు ఆయా మండలాలలోని చెరువులలో నీరు లేకపోవడంతో పశువులు సైతం దాహంతో అల్లాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతులు రెండు పంటలు సమృద్దిగా పండించాలనే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా ‘మిషన్ కాకతీయ’ పధకం చేపట్టింది. ఈ పధకం కింద మండలంలో 42 చెరువులకు కోట్లాది రూపాయలు వెచ్చించి మరమత్తులు చేపట్టారు. కాని చెరువు పనులను పూర్తిచేయకుండానే అధికారులు, గుత్తేదార్లు కుమ్మకై నిధులు స్వాచేయడంతో, మండలంలోని ఏ ఒక్క చెరువు వర్షాలకు పూర్తిస్ధాయిలో నిండకపోవడంతో అన్నదాత ఆశలు ఆవిరయ్యాయి. ఏజన్సీ మండలాలైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట, తాడ్వాయి ప్రాంతాలలోని చెరువులలో నీరు సమృద్దిగా లేకపోవడంతో, చెరువులను ఆసరాగా చేసుకుని రబీ పంట పండించాలనుకున్న రైతులకు ‘మిషన్‌కాకతీయ’ అందని ద్రాక్షగా మారింది. దీంతో చెరువు నీటితో పంటలు పండించాలనుకున్న రైతుల భూములు బీడుగా మారాయి. నీరులేని కారణంగా రైతులు పంటలు వేయడం మానుకోగా, వేసవిలో పశువులు త్రాగేందుకు చెరువులలో నీరులేని పరిస్ధితి నెలకొంది. నీటిపారుదలశాఖ (ఐబి) అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, గుత్తేదారులు ఇష్టారాజ్యంగా అసంపూర్తి పనులు చేపట్టి బిల్లులు పొందడంతో, కోట్లాది రూపాయలు ‘మిషన్‌కాకతీయ’ పేరిట దుర్వినియోగం అయ్యాయి. కాగా లక్షలాది రూపాయలతో మరమత్తులు చేపట్టిన చెరువులలో సైతం చుక్క నీరు నిలువలేదు. దీంతో ‘మిషన్‌కాకతీయ’ అధికారులు, గుత్తేదారుల పాలిట ‘కమీషన్ కాకతీయ’గా మారడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులపై దృష్టిసారించి, ప్రభుత్వ లక్ష్యాలను నీరుగార్చే అక్రమార్కులపై చర్యలు చేపట్టి, రెండవ పంటను పండించాలనే రైతన్నల కలలను సాకారం చేయాలని మండల రైతులు కోరుతున్నారు.

జడ్పీటిసి ఇంట్లో
అటవీ అధికారుల సోదాలు
మహాదేవపూర్, మార్చి 26: మహాదేవపూర్ అడవుల్లో దుప్పిలు వేటాడిన కేసులో ఏ 4 నిందితుడుగా ఉన్న మహాదేవపూర్ జడ్పీటిసి భర్త అక్బర్‌ఖాన్ ఇంట్లో ఆదివారం విజిలెన్స్ డిఎఫ్‌ఓ రాజశేఖరం ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కేసులో ఇతనిపై ఏ 4 నిందితుడిగా ఉండడంతో అతని ఇంటితో పాటు మరో ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు.