వరంగల్

2నుంచి రెండవ విడత పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 28: మహబూబాబాద్‌జిల్లా వ్యాప్తంగా ఎప్రిల్ 2నుండి రెండవ విడుత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని చెపట్టనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దమోదర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముందస్తు ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫొర్స్ కమిటీ సమావేశంలో జెసి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు రాబోయె తరాలపై ఆధారపడి ఉందని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోలియో చుక్కలు వేసి అంగవైకల్యం నుండి పిల్లలను రక్షించవచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా 1995నుండి పల్‌పోలియో కార్యక్రమం కొనసాగుతుందని, ఇప్పుడు పుట్టిన పాప నుండి ఐదు ఏండ్ల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వెయాలన్నారు. మారుమల గిరిజన ప్రాంతాల్లో విస్తత్ర ప్రచారాలు చెపట్టి ఇంటింటికి చుక్కలు వేసిన వారికి పి గుర్తు, వెయని వారికి ఎక్స్ గుర్తు మార్క్ చెయాలన్నారు. గతంలో చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కావాల్సిన పరికరాలతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, వ్యాక్సిన్ ఎక్కువ చేపు బయట ఉంచకుండా చల్లదనం తగ్గకుండా చూడాలన్నారు. అసమర్ధత పాటిస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లా వైద్యాధికారి శ్రీరాం మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు వైద్య సిబ్బంది ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి పల్స్‌పోలియో చుక్కలు 559కేంద్రాల ద్వారా జిల్లాలో వెయనున్నట్లు తెలిపారు. కేంద్రానికి నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం ఆశా కార్యకర్తలు 955, అంగన్‌వాడీలు 1163, సూపర్‌వైజర్లు 63మందితో కొనసాగించనున్నట్లు తెలిపారు. ఏడు ప్రాణాంతకమైన వ్యాదుల నిర్మూలనకు ఏప్రిల్ 7న మిషన్ ఇంద్రదనస్సు కార్యక్రమం చెపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రాణిబాయి, డాక్టర్ అంబరీష, డిప్యూటీ డియంహెచ్‌ఓలు వెంకటరమణ, రామారావు, డియంవో శ్రీనివాస్, వైద్య అధికారులు పాల్గొన్నారు.

వక్ఫ్ భూములను పరిరక్షించాలి
వడ్డేపల్లి,మార్చి 28:జిల్లాలోని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వక్ఫ్ కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 42 వక్ఫ్ సంస్థలకు సంబంధించిన భూములు సుమారు 1523 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఇట్టి భూములను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. వక్ఫ్ సంస్థ ఆస్తులను సంస్థపేరుమీదనే ఇవ్వాలని, రెవెన్యూ రికార్డులో అప్‌డేట్ చేయడంతోపాటు, వెబ్‌ల్యాడ్ పోర్టల్‌లో నమోదు చేయాలని, వక్ఫ్ ఆస్తుల జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు అందజేయాలని అన్నారు. సమావేశంలో జెసి హరిత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ఆర్డీఓలు మహేందర్‌జీ, రవి, తదితరులు పాల్గొన్నారు.