వరంగల్

గొత్తికోయలపై అటవీ అధికారుల దాడులు ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, ఏప్రిల్ 27: అడవిని నమ్ముకుని జీవించే అమాయక ఆదివాసీ గిరిజనులైన గొత్తికోయల గూడేలపై జరుగుతున్న ఫారెస్టు అధికారుల దాడులను ఆపాలంటూ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తవిటి నారాయణ గురువారం ఐటిడిఎ పిఒ చక్రధర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జయశంకర్ జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం సందరయ్య కాలనీకి చెందిన గొత్తికోయల గూడేలపై ఫారెస్టు అధికారులు జరిపే దాడులను నిలువరించాలన్నారు. స్థానిక అటవీ అధికారులు సుందరయ్య కాలనీ గొత్తికోయల వద్ద రూ.30వేలు ఇవ్వాలని డిమాండు చేయగా, గొత్తికోయలు రూ.5వేలతోపాటు కోళ్ళను ఇచ్చారన్నారు. మిగతా రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో గుడిసెలు ఖాళీచేయాలంటూ దాడులు జరిపారన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి అమాయక గొత్తికోయలకు రక్షణ కల్పించాలంటూ పిఒకు వినతినిచ్చినట్లు తెలిపారు. స్పందించిన పిఒ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. వినతినిచ్చిన వారిలో ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి తోలెం కిష్టయ్య, బాధిత గొత్తికోయలు మిడియం భద్రయ్య, శ్యామల రాజు, కోరం సమ్మయ్య, ఆలం జంపయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.

పరిపాలనా సంస్కరణల్లో భాగంగానే కొత్త జిల్లాలు

ప్రజలకు పరిపాలన మరింత దగ్గర కావాలనే రాష్ట్రంలోని పది జిల్లాలను 31జిల్లాలకు పెంచామని, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామీణ ఆర్ధికవ్యవస్థను బాగు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఈక్రమంలో రాష్ట్రంలో ఉన్న 30లక్షల మంది గొల్ల, కుర్మలకు ప్రతి సభ్యుడికి 21 గొర్రె పిల్లల యూనిట్‌ను అందించి రాబోయే రెండు సంవత్సరాల్లో 20వేల కోట్ల ఆదాయాన్ని సంపార్జించేలా పథకాన్ని రూపొందించామని తెలిపారు. అదే విధంగా కులవృత్తులపై ఆధారపడిన నాయి బ్రాహ్మణులు, విశ్వకర్మలకు బడ్జెట్‌లో 200కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాంలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 21లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాంల నిర్మాణాలు చేపట్టామని వెల్లడించారు. మిషన్ కాకతీయ కింద 19వేల చెరువులను పునరుద్దరించడం జరిగిందని, రాబోయే రోజుల్లో మిగిలిని అన్ని చెరువులను బాగు చేయనున్నట్లు చెప్పారు. బహిరంగ సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, ఇతర మంత్రివర్గ సభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రారంభమైన కల్యాణ బ్రహ్మోత్సవాలు
వరంగల్(కల్చరల్), ఏప్రిల్ 27: చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాలీ దేవాలయ క్షేత్రంలో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఉదయం 4గంటలకు ఉషఃకాలార్చన, నిత్యాహ్నికం నిర్వహించి, నైరుతిలోని వల్లభగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళీ మాతకు పూర్ణ్భాషేకం జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు బ్రహ్మోత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అదే విధంగా నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా శంకరాచార్యులను దర్శించుకొని బ్రహ్మోత్సవ పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఎంతో శ్రద్ధతో శాస్త్రోక్తంగా విశ్వకల్యాణం కోసం నిర్వహించే బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం జరిపే విధంగా ఈ ఏడు కూడా ఇతోధికమైన శ్రద్ధతో నిర్వహించాలని అధికారులను కోరుతూ ఆలయానికి వేలాదిగా అమ్మవారిని సేవించటానికి విచ్చేసిన భక్తులకు సకల ఏర్పాట్లను చేయాలని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ భద్రకాళి ఆలయంలో దేశంలో మరెక్కడా లేని విధంగా శాస్త్రంలో చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ వైశాఖ శుద్ధ పంచమి రోజున శివ కల్యాణం జరపడం ప్రాధాన్యతను సంతరించుకుందని అన్నారు. కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మొదటి రోజు ఉభయదాతలుగా తెలంగాణ ముదిరాజ్ సంఘం నాయకులు వ్యవహరించారు. సాయంత్రం 7గంటలకు అంకురార్పణ, ఉదకశాంతి, మృత్సంగ్రహణ క్రతువులను జరిపారు. భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అభివృద్ధే లేదు ప్రగతి సభ దేనికి?
వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్ 27: మిర్చి పంటకు గిట్టు బాటు ధర లేక ఒక వైపు రైతాంగం ఆత్మహత్యలు పాల్పడుతుండగా తెలంగాణ ప్రగతి పేరుతో బహిరంగ సభలు దేనికని తేదేపా నేత, ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ పని తీరును తీవ్రంగా విమర్శించారు. హరితహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కొంటున్నారని గ్రామాలలో మంచినీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో తేదేపా నాయకులు జగన్‌మోహన్‌రావు, నర్సింహామూర్తి, పట్ట్భా, సత్తిబాబు, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.