వరంగల్

నాణేల లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మే 14: రూ. 10 నాణేల చెల్లుబాటుపై రకరకాల వదంతులు వినిపిస్తుండటంతో సామాన్య జనం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సమస్య ఉత్పన్నమైనప్పడు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా కృషి చేయకపోవడంతో సమస్య రోజు రోజుకు జటిలంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉండగా అధికార యంత్రాంగం ఆ దిశగా చొరవ తీసుకోకపోవడం లేదు. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో రూ. 10 నాణేనికి రూ. 2 కమిషన్ తీసుకొని రూ.8 ఇస్తున్నారనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో ....
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టులను ధ్రువీకరించుకోకుండా కొంత మంది వాటిని అలాగే ఇతర గ్రూప్‌లకు షేర్ చేస్తుండడంతో రూ. 10 నాణేలు చెల్లుబాటు కావడం లేదనే వ్యాఖ్యలు విస్తృతం అయింది. ఈ అపోహలు అదిలోనే తుంచేయాల్సిన వారు సరైన సమయంలో స్పందించక పోవడంతో ఈ పరిణామం ఉత్పన్నమైంది. పని కట్టుకొని కొంత మంది చేస్తున్న అవాస్తవాలను అధికార యంత్రాంగం స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
పట్టణాల్లోనే ఎక్కువ...
రూ. 10 నాణేలు చెల్లుబాటు కావడం లేదన్న ప్రచారం గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికి కొన్ని మారు మూల ప్రాంతాల్లో రూ. 10 నాణేల చెల్లుబాటు అవుతుండగా పట్టణాలల్లో మాత్రం సమస్య తీవ్రంగా ఉంది. చిన్న చిన్న కిరాణ దుకాణాలు, బడ్డి కొట్లు కొంత మంది నాణేలు తీసుకోకపోవడంతో మిగితా వారంతా వీరిని చూసి వారు చెల్లుబాటు కాదనే నేపంతో తీసుకోవడం లేదు. అయితే రూ. 10 నాణేల చెల్లడం లేదంటూ కొన్ని ప్రాంతాల్లో వస్తున్న వదంతులకు అడ్డుకట్ట వేయాల్సిన సంబందిత అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో రూ. 10 చెల్లుబాటు కావడం లేదనే నేపంతో కొన్ని ప్రాంతాలలో కొంత మంది తమ వద్ద ఉన్న రూ. 10నాణేలతో బ్యాంకులకు వెళ్లితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాదానం చెప్పడం లేదంటే అందరు నాణేలు తీసుకొస్తే మేము ఎక్కడ లెక్కించుకుంటూ కూర్చుంటామంటూ సమాధానం చెబుతుండడంతో ఈ మాట ఆనోట ఈ నోట వెళ్లడంతో నాణేలు చెల్లుబాటు కావడం లేదనే వదంతులకు బలం చేకూర్చినట్లయిందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రూ. 10 నోట్ల స్థానంలో నాణేలను భారతీయ రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చిందని వీటిని మార్కెట్లో విరివిగా వినియోగిస్తే ఇబ్బందులు ఉండవని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంకు నుండి రూ. 10 నాణేలు రద్దు చేసినట్లు ఏలాంటి ప్రకటన, ఆదేశాలు కాని తమకు రాలేదని రూ. 10 నాణేలు తీసుకోవడానికి ఎవరైన నిరాకరించడం నేరమని మేధావులు పేర్కొంటున్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గూడూరు, మే 12: గూడూరు మండలంలోని పలు అభివృద్ది పనులకు ఆదివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని 365 జాతీయ రహదారి నుండి కేశ్యతండా వరకు 75లక్షలతో నిర్మించే బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా కోటి పదిలక్షలతో ఏపూరు నుండి రేగడి తండా వరకు, కోటి 60లక్షలతో కొమురంభీంనగర్ నుండి మచ్చర్ల వరకు బిటి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చెల్పూరి వెంకన్న, సర్పంచ్ వాంకుడోతు మోతిలాల్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాయిని ధర్మారెడ్డి, రాయిడి రవీందర్ రెడ్డి, దరావత్ శ్రీను, వాంకుడోతు కఠార్‌సింగ్, రామన్ననాయక్, నూకల సురేందర్, పెద్దకాసు కుమారస్వామి, కుందూరు శోభన్‌రెడ్డి, బెజ్జం రమేష్, సంపంగి రాంచందర్, రాములు, గోపిశోట్టి చిన్నమల్లయ్య, చెవులపల్లి దేవేందర్, ఏఇ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.