వరంగల్

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 21: నిబంధనలకు విరుద్ధంగా పోడు వ్యవసాయం చేస్తున్నారనే కారణంతో భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గిరిజన గూడెంపై దాడిచేసిన అటవీశాఖ అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని చైతన్య మహిళా సంఘం, దాడుల వ్యతిరేక పోరాట కమిటీ, వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేసా యి. అటవీశాఖ అధికారులు దాడుల సందర్భంగా గొత్తికోయల కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను ధ్వంసం చేయటం, మహిళల పట్ల విచక్షణారహితంగా వ్యవహరించటాన్ని నిరసించాయి. ప్రభుత్వ, అటవీశాఖ అధికారుల వైఖరికి నిరసనగా గురువారం చైతన్య మహిళా సంఘం, దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతుల భూములను బలవంతంగా లాగుకోవటం, అటవీ ప్రాంతంలోని వారి నివాస గృహాలను కూల్చివేయించడం దుర్మార్గమని అన్నారు. జలగలంచ గొత్తికోయల గూడెంపై అటవీశాఖ అధికారులుదాడులు జరిపిన సందర్భంలో అక్కడి గిరిజన మహిళలను చెట్టు కు కట్టివేయటం, బట్టలు ఊడేలా వ్యవహరంచటం సిగ్గుచేటని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు గిరిజనులు దేశం లో ఎక్కడైనా నివసించవచ్చని, వారికి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్య త ప్రభుత్వానిదని, పెసా చట్టం తప్ప దేశంలోని ఏ చట్టసభలు చేసిన చట్టాలు చెల్లవని స్పష్టం చేసారు. షెడ్యూల్డ్ ప్రాంతంలోని నదులు, చెరువులు, సంపదపై సర్వాధికారాలు గిరిజనులకేనని పెసా చట్టం చెబుతున్నా ప్రభుత్వం వీటికి భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జలగలంచ గిరిజన గూడెంపై జరిగిన దాడికి బాధ్యతవహిస్తూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్, మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. గిరిజన గూడెంపై దాడి ఘటనలో భూపాలపల్లి డిఎఫ్‌ఓ, ఇతర అటవీశాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద, గిరిజన మహిళల విషయంలో అమానుషంగా వ్యవహరించినందుకు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ చేసారు. బాధిత గిరిజన కుటుంబాలకు ఐదులక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందచేయాలని, ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరివాహక అటవీ ప్రాంతం లో పోడు చేసుకుంటున్న ఆదివాసుల పై దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేసారు. గిరిజనులపై దాడులకు వ్యతిరేకంగా ఈనెల 25న ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, ఎన్‌ఎఫ్‌డబ్ల్యూ నాయకురాళ్లు శ్రావణి, సదాలక్ష్మి, టిడిఎఫ్ భా రతి, టిపిఎఫ్ రాష్ట్ర నేత జనగామ కు మారస్వామి, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.