వరంగల్

పెరిగిన పత్తి సాగు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 24: పరకాల మార్కెట్ పరిధిలో పత్తి సాగు పెరిగింది. గత సంవత్సరం పరకాల మార్కెట్ పరిధిలో సుమారు 3లక్షల క్వింటాళ్ల పత్తిని ఖరీదు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ దరమిలా ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం ముందస్తు సన్నాహాలకు సిద్దం అవుతుంది. ఖమ్మం మార్కెట్‌లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని కౌలు, పత్తి సాగు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 25లోపు గ్రామాల వారిగా పత్తి సాగు విస్తీర్ణం లెక్కలు సేకరించాలని గడువు నిర్దేశించారు. మే, జూన్ మాసాల్లో రైతు సమగ్ర సర్వేలో రైతుల వారిగా పంటల సాగు విస్తీర్ణం వివరాలు సేకరించారు. అయితే పత్తి సాగు విస్తీర్ణం గణనీయమంగా పెరిగిన నేపథ్యంలో మరో సారి గ్రామాల వారిగా పత్తి సాగు వివరాలు సేకరించే బాధ్యతను వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించారు. అదేవిధంగా ఇది వరకు కార్డులు లేని రైతులు, కౌలు రైతుల పేరు, గ్రామం, సాగు విస్తీర్ణం, సర్వే, ఆధార్, మొబైల్, బ్యాంకు ఖాతా నెంబర్లు త్వరలోనే సేకరించనున్నారు. ఈ వివరాలతో రైతుల వారిగా ప్రత్యేక గుర్తింపు కార్డులు ముద్రించి అక్టోబర్ మూడో తేదిలోగా రైతులకు అందించేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. గత సీజన్‌లో మార్కెటింగ్ శాఖ అధికారులు అందచేశారు. కార్డులు అందని రైతులకు ఈ సారి ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
మద్దతు ధరతో...
పత్తికి ప్రభుత్వం ఇప్పటికే మద్దతు ధర ప్రకటించింది. ఈ సారి క్వింటాలు పత్తి ధరను రూ. 4320కి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గత సీజన్‌లో మద్దతు ధర రూ. 4160 ప్రకటించినా అశించిన స్థాయిలో సిసిఐ ఆధ్వర్యంలో పరకాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పత్తి కొనుగోళ్లు జరగలేదు. ప్రభుత్వం అందిస్తున్న ధర కంటే ప్రైవేట్‌గా విక్రయిస్తేనే అధిక ధర వస్తుందని రైతులు అటు వైపు మొగ్గు చూపారు. గత ఏడాది క్వింటాలుకు రూ. 5వేల నుంచి రూ. 5500 వరకు దళారులు కొనుగోలు చేశారు. ఈ సారి దళారులు ధర పెంచితే మళ్లీ పూర్వ పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశముందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి.
పరకాల మార్కెట్‌లో సుమారు రూ.150 కోట్ల పత్తి కొనుగోలు...
పరకాల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గత సంవత్సరం సుమారు 3లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులతో పాటు రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అంటే పరకాల వ్యవసాయ మార్కెట్ పరిధిలో సుమారు 150 కోట్ల మేరకు పత్తి విక్రయాలు జరిగాయి. అయితే ఈ దరిమిలా పరకాల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గత సంవత్సరం కంటే ఈ సారి భారీ స్థాయిలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. గత సంవత్సరం మిర్చి పంట సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా ఆశించిన స్థాయిలో మిర్చి ధర రాకపోవడం, ఒకేసారి మిర్చి ధర పడిపోవడంతో రైతులు ఆగ్రవేశాలకు గురి అయ్యారు. ఈ సారి మిర్చి పంట విస్తీర్ణంను రైతులు తగ్గించి దాని స్థానంలో కూడా పత్తి పంట వేయడంతో పత్తి విస్తీర్ణం భారీ స్థాయిలో పెరిగింది.
పరకాల, గూడెప్పాడ్, చిట్యాలలో సిసిఐ కేంద్రాలు...
గత సంవత్సరం కంటే ఈ సారి భారీ స్థాయిలో పత్తి విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరకాల వ్యవసాయ మార్కెట్‌లో సిసిఐ కేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ మండలం గూడెప్పాడ్‌లో కూడా సిసిఐ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పరకాల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని చిట్యాల మార్కెట్ పరిధిలో గల పత్తి మిల్లులో సిసిఐ కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పరకాల పరిధిలో మూడు సిసిఐ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించాలని వివిధ పద్ధతుల్లో ప్రచారం చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు సన్నద్దమవుతున్నారు. కరపత్రాలు, గోడపత్రికల ద్వారా గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూ పొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.
పండ్లతోటల పెంపకం ఎంతో మేలు
మహబూబాబాద్ టౌన్, సెప్టెంబర్ 24: పండ్లతోటల పెంపకం అక్టోబర్ నెలలో ఎంతో మేలు అని జీవవైవిద్య యాజమాన్య కమిటీ సభ్యుడు దైద వెంకన్న అన్నారు. ఆదివారం రైతులకు 200మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువమంది భూమి పుత్రులు ఆక్టోబర్‌లోనే పండ్లతోటలు పెంచుకోవడానికి, అక్టోబర్‌లో భూమి కూడా అనుకూలంగా ఉంటుందని అన్నారు. మొక్కలు కావాల్సిన వారు తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాము, నవీన్, శంకరయ్య, సారయ్య పాల్గొన్నారు.