వరంగల్

నర్సంపేటలో ఓపెన్ హౌస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, అక్టోబర్ 17: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నర్సంపేట పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని కెఎస్‌ఆర్ మహిళా డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు ఆయుధాల వినియోగం, పోలీసు స్టేషన్ పనితీరు గురించి ఎస్సై నాగ్‌నాద్ వివరించారు. ఈకార్యక్రమంలో లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ భరత్‌రెడ్డి, వేమిశెట్టి శ్రీనివాస్, ప్రసాద్, శివరాత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బెల్టు షాపులపై ఎక్సైజ్ దాడులు
* 30 క్వార్టర్ బాటిళ్ళు, 9 బీర్లు స్వాధీనం * ముగ్గురిపై కేసు
ఏటూరునాగారం, అక్టోబర్ 17: మండల కేంద్రంలోని బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమ మద్యం విక్రయ దారులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సిఐ ఫకీర తెలిపారు. వివరాలలోకి వెళితే... మంగళవారం ఎక్సైజ్ అధికారులు మండల కేంద్రంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే పిర్యాదు మేరకు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయం వీధిలోని హోటల్ యజమాని సప్పిడి రాము, కూరగాయలు విక్రయ దారుడు ఇర్సవడ్ల మోహన్‌రావు, ఆకులవారిఘనపురంలో కిరాణం దుకాణ దారుడు కందుల రాజయ్య వద్ద దాడులు చేయగా అక్రమంగా విక్రయిస్తున్న 30 క్వార్టర్ బాటిళ్ళు, 9 బీర్లు లభ్యమయాయ్యని, వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. దాడిలో ఎక్సైజ్ ఎస్సై రాజన్న, సిబ్బంది రమేష్, సారయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.
* స్వాధీనం చేసుకున్న మద్యం ఎక్కువ...
చూపించిన మద్యం తక్కువ
మండల కేంద్రంలో ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడుల్లో సుమారు 150 క్వార్టర్ బాటిళ్ళు లభ్యమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, అధికారులు మాత్రం 30 కార్వర్టర్ బాటిళ్ళను మాత్రమే లభ్యమైనట్లు చూపించడంపై ఇది షరా మామూలే అన్నట్లు పలువురు గుసగుసలాడారు.
* రొయ్యూరులో విచ్చలవిడి మద్యం విక్రయాలు...
ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామంలో బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని గ్రామస్ధులు ఆరోపిస్తున్నారు. ఏజన్సీ ప్రాంత మద్యం షాపుల టెండర్లు వాయిదా పడడంతో ములుగు, జంగాలపల్లి, మణుగూరు తదితర ప్రాంతాలనుండి కొంతమంది రాజకీయ నాయకుల అండతో కార్లలో రాత్రిపూట మద్యాన్ని ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాలైన రామన్నగూడెం, ఏటూరు, ముప్పనపల్లి, లక్ష్మీపురం, బుట్టాయిగూడెం, రొయ్యూరు, శంకరాజుపల్లి, ముళ్ళకట్ట రాంపూర్ తదితర మారుమూల ఏజన్సీ ప్రాంతాలలో తరలించి ఒక్కో క్వార్టర్‌పై ఎమ్మార్పీకంటే రూ.50నుండి రూ.70 వరకు అధిక ధరలకు విక్రయిస్తూ, మందుబాబుల జేబులు గల్లచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా... ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు స్పందించక పోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మద్యం విక్రయించే బెల్టు షాపులపై చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

బంగారు తెలంగాణ సాధనే కెసిఆర్ ధ్యేయం
* టె క్స్‌టైల్ పార్కు రూరల్ జిల్లాకు వరం * టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత
నర్సంపేట, అక్టోబర్ 17: పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మలిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా నిలవాల్సిందిగా టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత పిలుపునిచ్చారు. దుగ్గొండి మండల టిఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈసమావేశానికి మాజీ ఎమ్మెల్యే కవితతో పాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే కవిత మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లాలో టెక్సటైల్ పార్కు ఏర్పాటు వల్ల లక్ష పైచీలుకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. టెక్సటైల్ పార్కుకు ఈనెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారని, ఈసందర్బంగా నిర్వహించే బహిరంగసభకు పెద్ద ఎత్తున ప్రజలను కదిలించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. ఈసమావేశంలో టిఆర్‌ఎస్ నర్సంపేట నియోజకవర్గ నాయకుడు రాయిడి రవీందర్‌రెడ్డి, దుగ్గొండి జడ్పీటిసి సుకినె రజిత రాజేశ్వర్‌రావు, ఎంపిపి కుక్కమూడి సుశీల కమలాకర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు తోకల నర్సింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పిఎసిఎస్ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
* ట్రాక్టర్ల స్వాధీనం
గోవిందరావుపేట, అక్టోబర్ 17: మండలంలోని దయ్యాలవాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ మహేందర్‌కుమార్ తెలిపారు. మంగళవారం పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పస్రా సమీపంలోని దయ్యాలవాగు నుండి ఎలాంటి అనుమతి లేకుండా యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు వాటిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.

శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
* ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సాంబయ్య మాదిగ
నర్సంపేట, అక్టోబర్ 17: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర కార్యదర్శి దూడల సాంబయ్య మాదిగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జిల్లా అధ్యక్షుడు ఈదునూరి యాకయ్య అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దూడల సాంబయ్య మాదిగ మాట్లాడుతూ పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఎమ్మార్పీఎస్ టిఎస్‌తో పాటు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేయాలని అన్నారు. అదే విధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో డప్పు - చెప్పుకు ఫించన్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. పై రెండు సమస్యలను పరిష్కరించి మాదిగల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని చాటుకోవాలన్నారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈసమావేశంలో ఎమ్మార్పీఎస్ టిఎస్ నాయకులు నమిండ్ల చిన్న స్వామి, పొలిశెట్టి ప్రతాప్, కాయిత ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఆరెపల్లి బాబు, బరిగెల అయిలయ్య, నల్లబెల్లి సుధాకర్, చిలపాక బాబు, రాంబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అక్కడ.. మాటల తూటాలు పేలుతున్నాయి...
* డోర్నకల్ రాజకీయాల్లో విమర్శల టపాసులు * రెడ్యానాయక్ టార్గెట్‌గా వ్యక్తిగత ఆరోపణలు
మహబూబాబాద్, అక్టోబర్ 17: ప్రశాంత రాజకీయాలతో, పార్టీల ప్రచారంతో సాదాసీదాగా సాగే డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాల్లో తొలిసారిగా మాటల తుటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు ఆరోపణల పరంపర ముందే దీపావళి వచ్చినట్లుగా టపాసుల మొతలా మారింది. కొంతకాలం క్రితం టిడిపి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రామచంద్రునాయక్ గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న సభలు, సమావేశాల్లో రెడ్యానాయక్‌పై వ్యక్తిగత విమర్శల దాడికి తెరతీయడంతో నియోజకవర్గ రాజకీయాలు ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే వెడెక్కిపొతున్నాయి.
మాటల దాడులు.. ప్రతి దాడులు...
ఎమ్మెల్యే రెడ్యానాయక్ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి పరుడని, మోసగాడని, తుపాకిరాముడని విమర్శల పరంపర సాగుతుండడంతో రెడ్యా అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బలరాంనాయక్, భరత్‌చందర్‌రెడ్డిలను అన్ని మండలాల్లో పత్రిక విలుఖరుల సమావేశాలు నిర్వహించి ఉతికి ఆరేశారు. స్వయంగా రెడ్యానాయక్ సైతం ఆయన సహజదోరణికి భిన్నంగా బలరాంనాయక్, భరత్‌చందర్‌రెడ్డిలపై విరుచుకపడ్డారు. తాను లంబాడను అయినందునే భరత్‌చందర్‌రెడ్డి దొరతనంతో విమర్శలు చేస్తున్నారని కులం కార్డు ప్రయోగించారు. బలరాంనాయక్ కమీషన్‌లు తీసుకొని పనులు ఇచ్చిన ప్రభుద్దుడని, ఆయన మూలంగా తాను ఒక్క ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చిందంటూ గతాన్ని గుర్తుచేశారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమని సవాలు విసిరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే పార్టీ మారాల్సి వచ్చింది తప్పా తనకు ఏ స్వార్ధం లేదని విమర్శలు తిప్పికోట్టె ప్రయత్నం చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు సైతం అంతేస్థాయిలో స్పందించారు.
కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. జనరల్‌స్థానంలో కాంగ్రెస్‌పార్టీ తరుపున ప్రజలు గెలిపించినప్పుడు మద్ధతుగా నిలిచింది, రాజకీయ అవకాశాలు కల్పించింది దొరలు కాదా అని అన్నారు. అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతున్న రెడ్యానాయక్‌లో ఓటమి భయం పట్టుకుందని విలేఖరులతో చెప్పారు.
దీంతో గతవారం రోజులుగా డోర్నకల్‌లో రాజకీయ వేడి రగులుతొంది. తెరాస, కాంగ్రెస్ పార్టీల మద్య రసవత్తర రాజకీయ చర్చను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వారిద్దరు తిట్టుకుంటేనే మనకు నిజాలు తెలుస్తాయనే దోరణి ప్రజల్లో కనిపిస్తుంది. ఈ వాద ప్రతివాదాలు ఎందాక సాగుతాయో.. ఏ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.
వర్గీకరణపై జాప్యమేల
* మాదిగ జెఎసి
వెంకటాపుర్(నూగూరు), అక్టోబర్ 17: ఎస్సీల వర్గీకరణ జరపాలని గత రెండు దశాబ్ధాలుగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ మాదిగ జెఎసి జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నం గోపి విమర్శించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహం అవరణలో మండలస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.