వరంగల్

దళితులు సమస్యల పరిష్కారంలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, అక్టోబర్ 22: రాష్ట్రంలో దళితులు అనేక సంవత్సరాల నుండి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వాలు దళితుల సమస్యలను గుర్తించి, పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని దళిత హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్ గుండా మల్లేష్ ఆరోపించారు. ఆదివారం హన్మకొండలోని డిహెచ్‌పిఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లేష్ మాట్లాడుతూ గ్రామాలలో దళితులు భూసమస్యలు, సమాజిక సమస్యలతో బాధపడుతున్నారని, ప్రభుత్వాలు మాత్రం దళి
తుల సమస్యలు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకటరాములు మాట్లాడుతూ పేదలకు భూములు పంచడంలో కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దళితులు భూములు, ఇళ్ల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 16,17తేదీలలో డిహెచ్‌పిఎస్ రాష్ట్ర మహాసభలు హైదరాబాదులో జరపాలని నిర్ణయించారు. నవంబర్ 27న తెలంగాణ జిల్లాలలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహేందర్, ఎల్లేష్, సదానందం, గణేష్, కొమురయ్య, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.