వరంగల్

పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలపై అవగాహన పెంచుకొని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. సోమవారం మినీ కాన్ఫరెన్సు హాలులో నిర్వహించిన సమావేశంలో ఉద్యానవన పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యానవన పథకాలపై రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కలిగించాలని ఆదేశించారు. ఎక్కవ రాయితీపై బిందు, తుంపర్ల సేద్య పథకం అమలవుతుందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలని తెలిపారు. ఉద్యానవన పధకాల పురోగతిపై ప్రతి వారం సమీక్ష జరుపుకోవాలని సూచించారు.
బిందు సేద్యపు పరికరాలు అమర్చిన తదుపరి వాటి నిర్వహణ సర్వీసు, క్యాంప్ నిర్వహణ క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమలశాఖ అధికారిణి పి.సునీత ఉద్యానవన పంటలైన మామిడి, జామ, దానిమ్మతోటల పెంపకం వాటి యాజమాన్య పథక ప్రగతిని బిందు, తుంపర్ల సేద్యపు పథకాల ప్రగతిని తెలిపారు.
ఈ పధకాలను రైతులు ఆన్-లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం, పరికరాల సరఫరా తదితర విషయాలను కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఉద్యానవన అధికారులు శంకర్, యమున, మధులిక, మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ దిలీప్ పాల్గొన్నారు.

సమన్వయంతో ముందుకు సాగాలి
మహాదేవపూర్, అక్టోబర్ 23: సమాజంలో జర్నలిస్టులు, పోలీసులు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలని కాటారం డిఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు అన్నారు. సోమవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జర్నలిస్టులు, పోలీసులు పరస్పర సమన్వయం అనే అంశంపై కాటారం సబ్ డివిజన్‌లోని మహాదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో మహాదేవపూర్ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ జర్నలిస్టులు, పోలీసులు సమాజంలో ఒత్తిళ్ళతో కూడిన వృత్తిలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. సమాజ హితాన్ని కాంక్షించి సామాజిక సేవ దృక్పధంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఓ రమేష్ విలేఖరులు నైతిక బాధ్యతలు అనే అంశంపై వివరించారు. కాటారం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ చింతల శంకర్ రెడ్డి క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ అనే అంశంపై వివరించారు. రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై పలిమెల ఎస్‌ఐ నరేష్, దొంగతనాలు, క్రైం రిపోర్టింగ్ అనే అంశంపై కాటారం ఎస్‌ఐ తెలబోయిన కిరణ్, ఆయుధాలు, వాటి పనితీరు అనే అంశంపై మహాముత్తారం ఎస్‌ఐ మోరపెల్లిరాజు, ప్రాథమిక హక్కులు అనే అంశంపై మహదేవపూర్ ఎస్ ఐ ఉదయ్‌కుమార్‌లు వివరించారు. కాగా పాత్రికేయులు సమస్యలు, పరిష్కారాలు అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు గాదె రమేష్ వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు దిలీప్ సింగ్‌ను ఘనంగా సన్మానించారు. డిఎస్పీ ప్రసాదరావుకు మెమోంటోను అందజేసి, ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బన్సోడ రామారావు అధ్యక్షత వహించగా, కాటారం, మల్హర్ మండలాల అధ్యక్షులు కారెంగల శ్రీనివాస్ గౌడ్, బండారి రాజయ్య, మహాముత్తారం మండల ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు కండెల రాంచందర్, కాటారం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గైని రమేష్‌లతో పాటు సీనియర్ పాత్రికేయులు విబి రాజు, నారమల్ల సారయ్య, అరిగెల జనార్థన్, కాయిత తిరుపతి,పెండ్యాల రంజిత్, చీర్ల శ్రావణ్, పాడి రమేష్, వేముల శ్రీశైలం, మెండ మల్లేష్, గంట దేవదాస్, ఈర్నాల సుమన్, మహాముత్తారానికి చెందిన విలేఖరులు బోనాల ఉపేందర్, పంతకాని సూర్యనారాయణ, పలిమెలకు చెందిన పాత్రికేయులు రాము, రమేష్, శశాంక్, రాజేంద్రప్రసాద్, హైదర్, ప్రకాష్‌రెడ్డి, రేవెల్లి నాగరాజు, పరమవజ్జుల శివకుమార్, చిర్ర మహేష్, రాజబాపు తదితరులు పాల్గొన్నారు.

నాగుల పుట్టల వద్ద భక్తుల సందడి
మంగపేట, అక్టోబర్ 23 3 : కార్తీకమాసంలో తొలి సోమవారం కావడంతో సోమవారం మండలంలోని పలు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మండల కేంద్రంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంతో పాటు మల్లూరు, రాజుపేటలలోని శివాలయాలకు సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్ళి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని రాజుపేట శివారు గ్రామమైన లక్ష్మీనర్సాపురం గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయం, కోమటిపల్లి సమీపంలోని ముక్కుడు పోశమ్మ ఆలయానికి నాగుల చవితి సందర్బంగా సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం ఉదయమే పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు ముక్కుడు పోశమ్మ, నాగులమ్మ ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి నాగులమ్మకు మొక్కుకున్నారు. అనేక మంది భక్తులు రాజుపేట శివారు లక్ష్మీనర్సాపురంలోని నాగులమ్మ ఆలయాన్ని దర్శించుకుని బాడిశ వారి ఇలవేల్పు అయిన శ్రీనాగులమ్మ అమ్మవారికి పసుపు-కుంకుమ సమర్పించి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. సంతానం లేని మహిళలు నాగులమ్మ ఇలయం చుట్టూపొర్లు దండాలు పెట్టి తమకు సంతానం కలిగేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. నాగుల చవితి సందర్భంగా నాగులమ్మ ఆలయానికి విచ్చేసిన భక్తులు చేసిన నాగులమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగిపోయింది. ఆలయ పూజారి బాడిశ నాగ రమేష్ నాగులమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ బాడిశ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
పుట్టల వద్ద భక్తుల సందడి
వెంకటాపురం(నూగూరు): నాగులచవితి పండుగ కార్తీకమాసం తొలి సోమవారం రావడంతో దేవాలయాలలో ప్రత్యేకపూజలతోపాటు గ్రామ శివార్లలో ఉన్న పుట్టల వద్ద భక్తుల కోలాహలం సంతరించుకుంది. మహిళలు పుట్టకలుగుల్లో ప్రసాదాలు, కోడిగుడ్లు, ఆవుపాలను వదిలారు. పుట్టలపై అందమైన ముగ్గులు వేసి పూలు, పండ్లతో అలంకరించారు. వేకువజామునుండే పుట్టలవద్ద, దేవాలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. కార్తీకమాసం తొలి సోమవారం, నాగులచవితి రెండు ఒకేరోజు రావడంతో పూజలతో పూణ్యఫలాలు పొందవచ్చని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఘనంగా నాగుల చవితి
మహాదేవపూర్, కాటారం, మల్హర్, మొగుళ్ళపల్లి: నాగుల చవితి పండుగ సందర్భంగా సోమవారం మహాదేవపూర్, కాటారం, మల్హర్ మండలాలలో మహిళలు, భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గల పుట్టలలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాటారం మండలంలోని పలు గ్రామాలలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నాగుల చవితి పండుగ మొక్కులు చెల్లించుకున్నారు. మల్హర్ మండలంలో కొయ్యూరు సమీపంలో గల నాగులమ్మ దేవాలయంలో వివిధ మండలాల నుంచి భక్తులు వచ్చి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పుట్టలో పాలు పోసేందుకు ఉచితంగా పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో కాటారంలో ఆదర్శ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ కృషితా కార్తీక్ రావు, మహాదేవపూర్‌లో సర్పంచ్ కోట రాజబాపు, కాళేశ్వరంలో ఎంపిపి వెన్నపురెడ్డి వసంత, సర్పంచ్ మెంగని మాధవి, జడ్పిటిసి హసీనాబానో, ఆలయ కార్యనిర్వహణాధికారి బుర్రి శ్రీనివాస్ గౌడ్, మల్హర్ మండలంలో జడ్పిటిసి గోనే శ్రీనివాస్ రావు, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లె, మొగుళ్ళపల్లిలలో ఘనంగా నాగుల చవితి వేడుకలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపల్లెలో గల నాగులమ్మ దేవాలయంలో మహిళలు, భక్తులు పూజలు చేశారు.

తడిసిన ధాన్యం.. తల్లడిల్లిన రైతులు

జనగామ టౌన్, అక్టోబర్ 23: రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తెస్తే ఆదివారం రాత్రి కురిసిన వర్షం వారి పాలిట శాపంగా మారింది. ఎన్నో ఆశలతో వచ్చిన రైతులకు అకాల వర్షం మరింత కష్టాలకు గురిచేసింది. జనగామ వ్యవసాయ మార్కెట్‌కు గత ఐదు రోజులుగా సెలవులు ఉండటంతో ఆదివారం సాయంత్రం వరకు అనేక మంది రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చారు. టాక్టర్లు, టాటాఏసిల ద్వారా ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చి ఆవరణలో ఆరబోసారు. సాయంత్రం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిపించిది. దీంతో రైతులు దిక్కుతోచక అందుబాటులో ఉన్న టార్పాలిన్లను రాశులపై వేసుకోవడంతో అవి కొంతమందికే సరిపోయాయి. టార్పాలిన్లు అందని రైతుల ధాన్యం రాశులు తడిసిపోయాయి. పత్తి మార్కెట్ ఆవరణలో పళ్లపు ప్రాంతంలో పోసిన ధాన్యంరాశుల్లో కొంతభాగం వరదకు కొట్టుకుపొయాయి. రాత్రంతా రైతులు పడిగాపులు కాయాల్సి ఒచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం తేమశాతం లేని ధాన్యాన్ని మార్కెట్‌కు తెవాలని ప్రచారం చేస్తుంటే దానికి తోడు తమ దాన్యం వర్షంలో తడిసిపోవడంతో ఏంచేయాలో తోచడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రఘునాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన గుగులోత్ లక్ష్మి తమ ధాన్యంరాశిలోకి వర్షపు నీరు రావడంతో ఆనీరునంతా తోడేసేందుకు నానాయాతన పడింది. ఎండలో ఎండి, వానలో తడిసిన తమ బతుకులను పట్టించుకునేవారు ఎవరని కంటనీరు పెట్టింది. అలాగే లింగాలఘణపురం మండలం చిక్కులోని గూడెం గ్రామానికి చెందిన చిక్కుడు అబ్బసాయిలుకు చెందిన దాన్యం రాలు మార్కెట్ చివరిలో ఉండడంతో ధాన్యమంతా పక్కనే ఉన్న మట్టిలోకి కొట్టుకుపోయింది. దీంతో అబ్బసాయిలు, అతని భార్య ఎల్లమ్మ ఇద్దరూ కలిసి రోజంతా తమ ధాన్యాన్ని ఆరబోసుకునే ప్రయత్నం చేశారు.
అన్నదాతకు అష్టకష్టాలు
కేసముద్రం: కేసముద్రం మండలంలో సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి కురిసిన అకాల వర్షానికి మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులు తడిసిముద్దగా మారాయి. ఈనామ్ సర్వర్ మొరాయించడంతో టెండర్లు ఓపెన్ చేయడానికి కాస్త ఆలస్యం కావడం, దీనితో కాంటాలు పెట్టడానికి జాప్యం జరిగింది. ఫలితంగా ఆరుబయట సిమెంట్ కళ్లంపై పోసిన వందల క్వింటాళ్ల మొక్కజొన్నలు తడిసిపోయాయి. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కొద్దిసేపట్లోనే వర్షం కురవడంతో రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తడవకుండా కాపాడుకోలేక పోయారు. యార్డు వెనకవైపు ఆరబోసుకున్న మొక్కజొన్నల రాశుల్లోంచి కొంత వర్షంలో కొట్టుకుపోయాయి. కోమటిపల్లికి చెందిన కీమానాయక్, కేసముద్రం గ్రామానికి చెందిన కొంతం వాసు, కముటం స్వామి, వేముల శ్రీను, గూడురుకు చెందిన ఉప్పలయ్య, కలువలకు చెందిన జల్లె సైదులుకు చెందిన మొక్కజొన్నలు వర్షానికి తడిసిపోయాయి. అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.