వరంగల్

డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపికలో కొట్లాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల,నవంబర్ 20:డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్న సభలో కొట్లాట జరిగింది. సభలో అనర్హుల పేర్లను వెల్లడించడంతో ఘర్షణకు దారితీసింది. చేసేదేమీలేక అధికారులు సభ నుండి అర్ధంతరంగా వెళ్ళిపొయిన సంఘటన మండల కేంద్రంలో సొమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో పూల్లురి రమాదేవి అధ్యక్షతన డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభను నిర్వహంచారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ తోపాటు రెవెన్యూ సిబ్బంది హజరయ్యారు. అర్హుల జాబితాను అందరి సమక్షంలో చదువుతూ ఎంపిక పక్రియను తహసీల్ధార్ శ్రీనివాస్‌రావు కొనసాగించారు. అయితే గతంలో లబ్ధిదారుల ఎంపికను చేపట్టి అర్హులైన జాబితాను గ్రామపంచాయితీ తీర్మానంతో తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఎంపికైన అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని పలువురు గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపధ్యంలో ఫిర్యాదులను స్వీకరించిన తహసీల్దార్ సొమవారం తిరిగి గ్రామ సభ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పక్రియను చేపట్టారు.
అర్హులను , అనార్హుల జాబితాను చదవుతూ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు గ్రామసభలోని బహిరంగంగా గ్రామస్తులచే పక్రియను ప్రారంభించారు. కాగా ఫిర్యాదుదారల పేర్లను రహస్యంగా ఉంచాల్సిన తహసీల్ధార్ సభలో ప్రకటించడంతో ఘర్షణకు దారి తీసింది. గతంలో అర్హత పొందిన లబ్ధిదారులు అగ్రహంతో ఫిర్యాదుదారులపై దూషణలకు దిగి చొక్కాలు పట్టుకొని దాడులకు దిగారు. దీంతో చేసేది మీమీ లేక తహసీల్దార్‌తో పాటు సిబ్బంది సభ నుండి అర్ధంతరంగా జారుకున్నారు.
సమాచారం అందుకున్నా పొలీసులు గ్రామపంచాయతీ వద్దకు చేరుకొని ఘర్షణ పడుతున్న వారిని చెదరగొట్టారు. దీంతో సభ సద్దుమణిగింది. ఏదిఏమైనా డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపిక మండల కేంద్రంలో చర్చనీయంశంగా మారగా, తహశీల్దార్ వైఖరిని పలువురు విమర్శించారు.

గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు

సంగెం, నవంబర్ 20: గ్రంథాలయల ద్వారా సమాజంలో జరుగుతున్న మంచి, చెడు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివిధ మార్గాల ద్వారా ప్రజలకు తెలియజేస్తు విజ్ఞాన కేంద్రాలుగా విరజిల్లుతున్నాయని ఎంపిటిసి కళావతి అన్నారు. సోమవారం సంగెం మండల కేంద్రంలో 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సావాలను ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు గ్రంథాలయంలో లభ్యమవుతాయని చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులకు రోజు వివిధ రకాల పత్రికలను, వార, మాస పత్రికలను చదవడం ద్వారా మేథాశక్తి పెరుగుతుందని అన్నారు. వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన, ముగ్గుల పోటీలలో సంగెం ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అభిషేక్, కార్తీక్, మనీష, వెనె్నల, కస్తూరిభా గాంధీ విద్యాలయం బాలికలు శివాని, ఉషా, విద్యాభారతి పాఠశాల విద్యార్ధులు రూపా, పూజిత, బిందు, కళ్యాణి, రవిచంద్ర పాఠశాల విద్యార్ధులు సౌమ్య, రిత్విక గెలుపొంది బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లికాంబ, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నరహరి, వార్డు సభ్యులు శ్రీ్ధర్ , రమేష్ గ్రంథాలయం అధికారి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాల బలోపేతానికి కృషి
శాయంపేట: గ్రంథాలయం బలోపేతానికి తమవంతు కృషి చేస్తానని ఎంపిపి రమాదేవి అన్నారు. 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని శాయంపేటలోని శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థినీ, విద్యార్థులకు చిత్రలేఖనం, పాటలు, ఉపన్యాస, వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఎంపిపి బాసాని రమాదేవి, సర్పంచ్ చంద్రవౌళి బహుమతులు అందచేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తదితరులు పాల్గొన్నారు.
జ్ఞానసంపదకు
గ్రంధాలయాలు దోహదం
ఆత్మకూరు: విజ్ఞాన సంపదకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతాయాని ఎంపీపీ గోపు మల్లికార్జున్ అన్నారు. సోమవారం జరిగిన గ్రంథాలయ వారోవాత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విజ్ఞాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోందని చెప్పారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అయన పిలుపునిచ్చారు. పుస్తకపఠనం రోజురోజుకు కనుమరుగవుతోందని అవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలను చదివే ఆలువాటు విద్యార్ధి దశనుండే అలవరచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గండు రాము, గ్రంథాలయ అధికారి అనిత, వివిధ పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు.
విజ్ఞాన కేంద్రాలు గ్రంథాలయాలు
నల్లబెల్లి: విజ్ఞాన కేంద్రాలు, గ్రంధాలయాలు వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నల్లబెల్లి ఎంఆర్‌పిఎస్ అద్యక్షుడు పర్కి కోర్నేల్ అన్నారు. గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనంపై పరీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రందాలయాల్లో విజ్ఞాన సంపద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రందాలయాల ఇన్‌చార్జి రాపాల లక్ష్మీనారయణ, ఉపాద్యాయులు కందుగుల గోవర్ధన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

‘గుడ్డు’ అడ్డం తిరిగింది

* ధర పెరిగిందని పంపిణీ నిలిపివేత * పప్పుచారుతో సరిపెడుతున్న వైనం * విద్యార్ధులకందని పౌష్టికాహారం

కేసముద్రం, నవంబర్ 20: కోడిగుడ్డు ధర కొండెక్కిందనే సాకుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు కోడిగుడ్డు అందించడం లేదు. మండల వ్యాప్తంగా 82 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కెజీబీవి, మూడు హాస్టళ్లు, ఒక మోడల్ స్కూల్‌లో కలిపి దాదాపు 5500 మంది విద్యార్ధులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దినం తప్పించి దినం, హాస్టళ్లలో ప్రతిరోజూ కోడిగుడ్డు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతి విద్యార్థికి ఇచ్చే కోడిగుడ్డు కోసం ప్రభుత్వం 4 రూపాయలుగా ధర నిర్ణయించింది. ఆ మేరకు ప్రతి నెలా కోడిగుడ్లకు బిల్లు చేసి పంపిస్తారు. అయితే ఇటీవల కోడిగుడ్ల ధర ఒక్కింటికీ ఉన్నట్టుండి ఏడు రూపాయలకు ఎగబాకడంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కోడిగుడ్లు ఆ ధరకు అందించలేమంటూ చేతులెత్తేసినట్టు సమాచారం. ఫలితంగా మండలంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులకు భోజన పళ్లెంలో పక్షం రోజులుగా కోడిగుడ్డు కనుమరుగైందంటున్నారు. ఇక కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కేవలం పప్పు, నీళ్ల చారుతో సరిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అటు గుడ్డు లేక.. ఇటు రుచీపచీ లేని కూరలతో మధ్యాహ్న భోజనం చేయడానికి విద్యార్థులు నిరాసక్తత చూపుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఫలితంగా ప్రతి రోజు ఆయా పాఠశాలల్లో వండిన సగం అన్నం వృథాగా వదిలేస్తున్నారంటున్నారు. విద్యా సంవత్సరానికి ఒకేసారి హాస్టళ్లలో.. పాఠశాలల్లో ఏళ్ల తరబడి ఒకే తరహాలో కోడిగుడ్లకు, కూరగాయలకు ధరలను నిర్ణయించడం ఇలాంటి ఇబ్బందులకు దారితీస్తోందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎప్పటికప్పుడు పెరిగే నిత్యావసర ధరలతో వంటవండిపెట్టే వారికి బిల్లులు మంజూరు చేస్తే విద్యార్ధులకు ఎలాంటి ఆటంకం లేకుండా పౌష్టికాహారం అందుతుందంటున్నారు.