వరంగల్

పరీక్షలకు అభ్యర్థుల కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, డిసెంబర్ 17: టీచర్ రిక్రూట్‌మెంట్‌పై గత నెలన్నర రోజులుగా అభ్యర్థులో నెలకొన్న సందిగ్థతకు తెర పడింది. ఉమ్మడి జిల్లాలో 368 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటనను తిరిగి టీఎస్‌పీఎస్పీ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. 2012 అనంతరం నిర్వహిస్తున్న టీఆర్టీ కోసం ఉమ్మడి జిల్లాలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. గత అక్టోబర్ చివరిలో టీఆర్టీ ప్రకటనను టీఎస్‌పీఎస్సీ కొత్తగా 31 జిల్లాల ప్రాతిపదికన జారీ చేసి దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే అభ్యర్థులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొత్త జిల్లాల్లో పోస్టులు తక్కువగా ఉండటంతో పాటు స్థానికత కూడా మారుతుండటం వల్ల నష్టపోతున్నామన్న బెంగ అభ్యర్థుల్లో పట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొందరు అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఉద్యోగ నియామకాల ప్రకటనలన్నింటీని పాత జిల్లాల పాత్రిపదికన వెల్లడించి ఒక్క టీఆర్టీని కొత్త జిల్లాల ప్రాతిపదికన వెలువరించడంతో నష్టపోతున్నామంటూ పలువురూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని అశ్రయించారు. దీంతో న్యాయస్థానం కూడా వారికి అనుగుణంగా తీర్పు నిచ్చింది. దీంతో పాత 10 జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పోస్టులను భరీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ వారు సవరణ ప్రకటన జారీ చేయడంతో అభ్యర్థుల సందేహాలకు తెరపడడంతో పాటు సంతోషం నెలకొంది. మరో వైపు ఇప్పటికే కొత్త జిల్లాల ప్రాతిపదికన దరఖాస్తు చేసుకున్న వారు ఉమ్మడి జిల్లాగా ఆప్షన్‌ను మార్చుకునేందుకు ఈనెల 15 నుంచి 26 వరకు గడువు విధించారు. అలాగే కొత్త జిల్లాల ప్రాతిపదికన తక్కువ పోస్టులున్నాయంటూ స్థానికతపై కూడా అసంతృప్తితో ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు గడువును పెంచినట్లు సమాచారం.
ఓవైపు తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ అవుతుంటడం, మరో వైపు టీఆర్టీ పరీక్షకు నెలన్నర సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులకు ఉద్యోగాలు సాధించడం పరీక్షగా మారుతుందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొనే్నళ్లుగా వీటి కోసం ఎదురు చేస్తున్న అభ్యర్థులు తమ లక్ష్యాన్ని ఛేదించాలంటే మరింత శ్రమించక తప్పదు. 2012 అనంతరం టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల నియామకాలు జరుగుతుండటంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంటుందనే వ్యాఖ్యలు పలువురు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాదిన్నరగా అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం ఊరించి తుదకు గత అక్టోబర్‌లో ప్రకటన జారీ చేయడంతో అభ్యర్థులు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందడానికి సిద్దం అయ్యారు. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండటం వల్ల ఫిబ్రవరిలో జరిగే టీఆర్టీ పరీక్షలో నెగ్గాలంటే తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిందేనని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

నేడు బంద్‌కు ఆదివాసీ జేఏసీ పిలుపు
వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 16: లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, ఆదివాసీ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ జేఏసీ అధ్వర్యంలో వెంకటాపురం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివాసీ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షురాలు ఝాన్సీలక్ష్మీబాయి, సర్పంచ్ నారాయణమ్మ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఆదివాసీల ఉద్యమాన్ని అనిచివేసేందుకు కేసులు పెట్టించి ఉద్యమన్ని నీరుగార్చేందుకు చూస్తోందని ఆరోపించారు. పోలీసు అధికారులు ఉద్యమంలో మావోయిస్టులు ప్రవేశించారని అనడాని జేఏసీ నాయకులు ఖండించారు. సోమవారం జరిగే బంద్‌కు ఉద్యమ సంస్థలు, వర్తక, వాణిజ్య సంస్థలు, సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు సాయి, నర్సింహమూర్తి, నరేష్, వెంకటరమణ, రామరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాజీవనానికి భంగం కలిగించవద్దు
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల అనుమతితో ఆదివాసీ జేఏసీ నాయకులు ఉద్యమం చేసుకోవాలని వెంకటాపురం ఎస్సై బండారి కుమార్ కోరారు. ఆదివారం స్థానిక పోలీసుస్టేషన్ జేఏసీ నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.
ఉద్యమాలతో ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలని, పోలీసుల అనుమతితో ఆందోళన కార్యక్రమాలు చేసుకోవచ్చని అన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై జేఏసీ నాయకులకు పలు సూచనలు చేశారు.