వరంగల్

సత్యనిష్ట.. సాధుజీవనం సేవాలాల్ మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 18: సత్యనిష్ట.. సాధుజీవనం శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం అని అది ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. మరిపెడ మండలకేంద్రంలో ఆదివారం సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మరిపెడలో భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజనుల ఆటాపాటలు, సాంప్రదాయ డప్పువాయిద్యాలతో మరిపెడ పట్టణం మారుమోగిపోయింది. అనంతరం గిరిజన పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వందలాది మంది గిరిజనులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మానుకోట పార్లమెంటు సభ్యుడు సీతారాంనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌లు మాట్లాడుతూ.. సేవాలాల్ సేవలను కొనియాడారు. ఆదర్శవంతమైన సమాజం నిర్మించేందుకు సేవాలాల్ కృషిచేశారన్నారు. మధ్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉంటూ తమ సమాజంలోని వెనుకబడిన వారికి చేయూతనందించే దిశగా పనిచేయాలనే గొప్ప నీతిని సేవాలాల్ మనకందించారన్నారు.
గిరిజన వర్గాలు మరింత అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని, ఈ వర్గంలో జన్మించి కొంతమేర అభివృద్ధి సాధించిన ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ జాతీకి సేవచేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేవాభావం, సమాజ హితం సాధుజీవనం మార్గాలుగా ముందుకు సాగినప్పుడే శాంతియుత సమాజ స్థాపన, వెనుకబడిన వర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుందని వారు తెలిపారు. సేవాలాల్ జయంతి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, తెరాస యువజన విభాగం నాయకులు డిఎస్ రవిచంద్ర, మరిపెడ ఎంపిపి తాళ్లపల్లి రాణి, జెడ్పిటీసీ బాలినె మాణిక్యం, మరిపెడ సర్పంచ్ రాంలాల్, మండలపార్టీ అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణరెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీను, గుగులోతు వెంకన్న, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు అయూబ్‌పాష తదితరులు పాల్గొన్నారు.