వరంగల్

హోంగార్డు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 18: హోంగార్డు సిబ్బంది సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని వరంగల్ పోలీస్ కమీషనర్ జి. సుధీర్ బాబు తెలిపారు. కార్మికశాఖ ప్రారంభించిన ప్రమాద భీమా పథకంపై హోంగార్డ్స్‌కు అవగాహన సదస్సును ఆదివారం పోలీస్ కమీషనరేట్ కార్యాలయములోని రుద్రమదేవి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికశాఖ అధ్వర్యంలో సామాజిక భద్రత పథకంలో భాగంగా ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్, హోంగార్డ్స్ , వర్కింగ్ జర్నలిస్ట్‌లకు ఐదు లక్షల రూపాయల కవర్ అయ్యే విధంగా ప్రమాదంలో మరణించిన వారికి భీమా పథకం వర్తింపజేయడంతో పాటు, ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, ఈ భీమా పరిధిలోని వచ్చే ప్రమాదాల రకాలు, దీని లబ్ధిదారులు ఏవరు మొదలైన అంశాలను కార్మిక శాఖ ఆసిస్టెంట్ కమీషర్లు ఎన్. శంకర్, ఎస్. రమేష్‌బాబు హోంగార్డ్స్‌కు వివరించారు. అనంతరం ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హజరైన వరంగల్ పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ రాష్టమ్రుఖ్యమంత్రి ఆలోచనతో ఏర్పాటుయిన ఈ పథకం హోంగార్డ్స్‌కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేల్లించడం జరుగుతుందని వివరించారు.