వరంగల్

సీతారామ కళ్యాణ ఏర్పాట్లలో లోటు ఏర్పడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 23: శ్రీరామ నవమి ఉత్సవాలకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 26న శ్రీరామ నవమి సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ కార్పోరేషన్ మరియు గ్రామీణ, మండలాల్లో అన్ని గ్రామాల్లో స్థానికంగా ఘనంగా శ్రీరామనవిమి ఉత్సవాలు జరుగనున్నందున భక్తులు పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొంటారని వరంగల్ జాయింట్ కలెక్టర్ దయానంద్ అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఉత్సవాలు జరిగే స్థలాలోగట్టి బందోబస్తు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ దయానంద్ అన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో శ్రీరామ నవమి ఏర్పాట్లపై సమీక్షించారు. సీతారాముల కళ్యాణం లోక కాళ్యాణంగా భావించి అన్ని ప్రాంతాల్లో స్థానికంగా శ్రీరామ నవమి రోజు వరంగల్ కార్పోరేషన్ పరిధిలో అన్ని గ్రామాల్లో శ్రీరామ నవమి ఉత్సవాలు జరపుకునే ప్రతి చోట భక్తులకు ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యాలు తలెత్తకుండా అవసరమైన మేర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ఉత్సవ ప్రాంతాలలో శానిటేషన్, మంచి నీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అదే విధంగా శ్రీరామ నవమి (సీతారాములు కళ్యాణం) ఉత్సవ కమిటీ సభ్యులు విధిగా వారి ఉత్సవ వివరాలను దేవాదాయ శాఖ సహాయం సంచాలకులు కార్యాలయంలోను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ముందస్తుగా అందజేయాలని అన్నారు. అదే విధంగా ఎక్కడైన అనుకోని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే వరంగల్ అగ్ని మాపక కేంద్రం 08702577666 హన్మకొండ 08702565802 సెంటర్లకు కాల్ చేయవచ్చునని తెలిపారు. ప్రమాదాలు జరినట్లైతే 108 నెంబర్‌కు కాల్ చేసి వైద్య సదుపాయం పొందవచ్చునని ఆయన సూచించారు. ఈ సమావేశంలో హన్మకొండ ఏసీపీ రాజేంద్ర ప్రసాద్, ఆర్‌డివో అంకా రెడ్డి, సమాచార పౌరసంబందాల ఖాఖ ఉప సంచాలకు డిఎస్ జగన్, ఈవో ఇండో మెంట్ సునీత, జిల్లా అగ్ని మాపక అధికారి నాగరాజు, కలెక్టర్ పరిపాలన అధికారి రేణుక వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.