వరంగల్

ప్రజల కల సాకారమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మార్చి 24: పరకాల ప్రజల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ కల నెరవేరిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల కల నేడు నెరవేరిందన్నారు. రెవెన్యూ డివిజన్ పరకాల నుండి తరలించినప్పుడు అధికారంలో టీడీపీ, స్థానిక ఎమ్మెల్యే బిజేపీ కుమ్మక్కు కావడం వల్ల తరలి పోయిందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 6 తాలుకాలు ఉంటే పరకాల పాత తాలుకా భౌగొళిక స్వరూపం లేకుండా చేసింది ఎవరని ప్రశ్నించారు. ఆర్డీవో స్థాయి అధికారిని తిట్టింది ఎవరని ప్రశ్నించారు. భూ అక్రమణలు చేసింది నిజమా కాదా అని పేర్కొన్నారు. జిల్లా పునర్విభజనలో భూపాలపల్లి జిల్లాను చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధృడసంకల్పం, భూపాలపల్లిలో బొగ్గు గనులు ఉండడంతో జిల్లా అయినట్లు తెలిపారు. పరకాల పాత తాలుకాలో ఉన్న భూపాలపల్లి నియోజకవర్గం కావడమే కాకుండా జిల్లా కావడంతో పరకాల ఒంటరి పరకాలగా మారిందన్నారు. టెక్స్‌టైల్స్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పార్క్ విజయవంతం కావడంతో పార్క్‌కు కానుకగా పరకాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారని చెప్పారు. పాత తాలుక మండలాలతో కలెక్టర్ ప్రతిపాదనలు కూడ పంపించారని తెలిపారు. అందరి కష్టం వల్ల పరకాల రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిందన్నారు. నడికూడ మండలం త్వరలో ఏర్పాటు అవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పిటిసి కల్పనాదేవి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ భిక్షపతి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, పరకాల నగర పంచాయతి చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య, పరకాల పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు దుబాసి వెంకటస్వామి, నాగిరెడ్డి, గీసుకొండ మండల పార్టీ అధ్యక్షులు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
ఏడవరోజుకు వసంత నవరాత్రోత్సవాలు
వరంగల్(కల్చరల్), మార్చి 24: వరంగల్ నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయ క్షేత్రంలో జరుగుతున్న భద్రకాళి వసంతనవరాత్రోత్సవాలు శనివారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఆలయ అర్చకులు ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించి ఈనాటి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు పాలకుర్తి నర్సింహమూర్తి శర్మ, ప్రదీప్ శర్మలు వేదమంత్రాలు పఠిస్తుండగా వేదవిద్యార్థులు లక్ష గులాబి పుష్పార్చనను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కోమల్ల శ్రీ్ధర్ రెడ్డి, కీర్తి దంపతులు ఈనాటి పుష్పార్చనకు ఉభయదాతలుగా వ్యవహరించారు.