వరంగల్

45 నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మార్చి 24: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 45 నియోజకవర్గాలలో బలంగా ఉందని, అన్ని నియోజకవర్గాలలో పది నుండి 20 శాతం ఓటింగ్ సైతం ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలో శనివారం మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈసందర్భంగా రేవూరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఇప్పటికే సీపీ ఐ పార్టీ స్వాగతించిందన్నారు. టీడీపీ అడిగితే పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా పోటీ చేస్తే ఆయా పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసేంత మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు. టీడీపీ నుండి చాలా మంది నాయకులు ఇతర పార్టీలకు వెళ్లిపోయారని, అయితే కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. ఈక్రమంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర నాయకులంతా సమష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని, తమ అధినేత సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు సన్యాసులేనని, అయితే తప్పనిపరిస్థితిలో చిన్న సన్యాసితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదన్నారు.
* కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటే తాను తీసుకుంటా..
వయసూడిగిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెబుతున్న అధికార పార్టీ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటే తాను మరుక్షణమే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తన వయస్సు కంటే సీఎం కేసీఆర్ రెండేళ్లు పెద్ద వారని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం పెద్దవారని చెప్పారు. ఈవిషయం తెలియకుండా పెద్ది మాట్లాడడం అవివేకమన్నారు. తాను నిర్ధిష్టమైన అంశాలపై ఉద్యమిస్తుంటే చర్యలకు ఉపక్రమించాల్సింది పోయి తనపైనే విమర్శలు గుప్పించడం సరి కాదన్నారు. ఎమ్మెల్యే దొంతి చేస్తున్న అవినీతిపై ప్రశ్నించి ఆందోళనలు చేస్తే తప్పు పట్టిన పెద్ది ఇటీవల వంటా వార్పు కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవిలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఎర్ర యాకూబ్‌రెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, మామిండ్ల మోహన్‌రెడ్డి, వేముల బొందయ్యగౌడ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్‌నాయక్, కసంపత్, దేశిని సుదర్శన్, సుభాష్‌నాయక్, బంక రవీందర్, జనగం స్వామి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కేసిఆర్ ఫ్రంట్ నాటకం
*బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీఎల్ ఎన్‌రెడ్డి
పాలకుర్తి, మార్చి 24: ఇంట్లో పోరు పడలేక రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ మూడవ ఫ్రంట్ నాటమడుతున్నారని భారతీయ జానత పార్టీ జనగాం జిల్లా అధ్యక్షులు కెవి ఎల్ ఎన్ రెడ్డి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 80వేల ఇళ్లు మంజురు చేస్తే అందులో 8వేలు నిర్మించలేదని ఎద్దేవ చేశారు. ఉద్యమంలో పనిచేయాని నాయకులకు రాజ్యసభ సీట్లు కుటాఇచ్చి అమరుల కుటుంబలను విస్మరించారని మండిపడ్డారు. మహారాష్ట్ర,మధ్యప్రదేశ్ రాష్టల్ల్రో రైతులు ధర్నాలు చేస్తే కూర్చోబెట్టి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తే, బంగారు తెలంగాణలో రైతులను అరెస్టులు చేస్తున్నారని చేప్పారు. పోతన నడియాడిన నేలను స్మృతివనంగా మారుస్తామని కెసీ ఆర్ చెప్పి 10నెలలు గాడుస్తున్న ఇప్పటికి టెండర్లు పిలిచి పనులు మెదలు పెట్టిన దఖాలు లేవన్నరు. అసేంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నింస్తే చిరాకు పడుతు సస్పెండ్‌లు చేయిస్తు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాబోవు రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దొంగరి మహేందర్,రాష్ట్ర నాయకులు పెద్దగాని సోమయ్య,సుధకర్‌రెడ్డి, శ్రీకాంత్,రాజశేఖర్,వెంకటేశ్వర్లు,రవికూమార్,మహేష్, పాల్గోన్నారు.