వరంగల్

నేరాల రుజువుకు నైపుణ్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 24: నేరస్థులు చేసిన నేరాలు కోర్టులో రుజువుకావాలంటే దర్యాప్తు అధికారులు నైపుణ్యమై దర్యాప్తు చేపట్టాలని వరంగల్ కమిషనర్ డా.వి. రవీందర్ పిలుపునిచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసీక్యూషన్స్ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో ఇనే్వస్టిగేషన్, సెక్షన్ 41సిఆర్‌పి అనే అంశంపై వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసీక్యూటర్లతో ఏర్పాటు చేసిన సెమినార్‌లో వరంగల్ కమిషనర్ రవీందర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈసదస్సులో నేరం జరిగినప్పుడు నేరస్థులు పాల్పడిన నేరాన్ని కోర్టులో రుజువు చేయడంతో పాటు నేరస్థులకు శిక్ష పడేందుకుగాను దర్యాప్తు అధికారులు దర్యాప్తు తీరుతెన్నులు, సేకరించాల్సిన రుజువులు, సాక్ష్యాల సేకరించడంలో పోలీస్ అధికారుల వ్యవహరించాల్సిన విధానంతో పాటు, దర్యాప్తులో భాగంగా సేకరించాల్సిన డాక్యుమెంట్ల వివరాలు, సుప్రీం కోర్టు, హైకోర్టు సూచించిన మార్గదర్శకాలను అనసరించాలన్నారు. పోలీస్ అధికారులు అందజేసిన సాక్ష్యాధారాలతో పాటు పబ్లిక్ ప్రాసీక్యూటర్లు నిర్వహించే న్యాయ విచారణ సమయంలో పరిగణలోకి తీసుకోవల్సిన సాక్ష్యాలు, సుప్రీం కోర్టు పరిధిలోని కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలను సేకరించడం ద్వారా నిందితులుపై మోపిన అభియోగాలు రుజువైనాయనే అంశాలపై రెండవ గ్రేడ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసీక్యూటర్ యం. సత్యనారాయణ ఈ సెమీనార్‌లో వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసు అధికారులు దర్యాప్తులో ఎలాంటి లోపాలు లేకుండా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదుయిన వెంటనే అధికారులు దర్యాప్తు ప్రారంభించే ముందుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనసరించాల్సి ఉటుందని అన్నారు. ఈ విధంగా ఆమలు చేయడం దర్యాప్తు చేయడం ద్వారా తగినన్ని రుజవులు సేకరించడం ద్వారా నిందితుల నేరాలను కోర్టులో నిరుపించడంతోపాటు బాధితులకు న్యాయం చేకూర్చిన వారమవుతామని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల కోర్టుల్లో నేరస్థులకు శిక్షపడే సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఈ సెమీనార్‌లో రెండవ గ్రేడ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంమూర్తిసర్దార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ్ధర్, సెంట్రల్, ఈస్ట్ జోన్ డీసీపీలు వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లుతో పాటు అదనపు డీసీపీలు పూజ, మురళీధర్, పోలీస్ కమిషనరేట్ ఏసిపిలు, ఎన్స్‌స్పెక్టర్లు , తదితరులు పాల్గొన్నారు.