వరంగల్

శోభాయమానంగా శోభాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, ఏప్రిల్ 28: వరంగల్ వికాస తరంగిణి అధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వరకు గురువారం రామపాదుకల శోభాయాత్ర భక్తి ప్రపత్తుల మద్య జరిగింది. శోభాయాత్రకు ముందుభాగాన శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి నడిచారు. ఉదయమే వికాస తరంగిణి కార్యకర్తలు, భక్తులు పబ్లిక్ గార్డెన్ చేరుకున్నారు. అనంతరం భక్తుల భజనలు, కోలాటాలతో సందడిగా యాత్ర ప్రారంభమైనది. దీంతో నగర వీథులన్నీ శ్రీరామ స్మరణతో మారుమోగాయి. ఈ సందర్బంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ పూర్వం కాలంలో నగర సంకీర్తనలు ఉండేవని, వీథులలో వెళ్లే భక్తులు చేసిన భగవంతుని స్మరణ విన్నా, వారితో కలసి నడిచినా పుణ్యఫలం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు శాంతి సౌఖ్యం పెంపొందించుకునేందుకు పురాణాలలోని చరిత్ర స్మృతులను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధర్మం అనేది అందరిదని ప్రతివ్యక్తి ధర్మాన్ని పాటించాలని ఆయన ఉపదేశించారు. నేడు ధర్మం అంటే అది కేవలం కొందరు ఆచరించాల్సినదనే భావన సమాజంలో ఉందని, ఇది సమాజ గతికి ఎంత మాత్రం మంచిది కాదని స్వామీజీ హితువుపలికారు.్భక్తులందరూ తలపై రామపాదుకలను ధరించి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం.