వరంగల్

కాజీపేటను డివిజన్‌గా మార్చేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 28: కాజీపేటను రైల్వేపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాదనలో ఉన్న కాజీపేటను డివిజన్ కేంద్రంగా మార్చేందుకు తమవంతు కృషి చేస్తామని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు సీతారాంనాయక్, వరంగల్ పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. గురువారం సాయంత్రం వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమైక్యపాలనలో రైల్వేపరంగా కాజీపేట అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని విమర్శించారు. ఇకతాము రైల్వేపరంగా కాజీపేటను అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. త్వరలోనే 269కోట్లతో పిఓహెచ్ ఫ్యాక్టరీ, ఫిట్‌లైన్ నిర్మాణం, కాజీపేట రైల్వే స్టేషన్‌లో రెండు నూతనంగా ఎక్స్‌లేటర్లను ఏర్పాటు కానున్నాయన్నారు. ఎలక్ట్రిక్ లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్‌ల స్థాయిని పెంచనున్నట్లు వెల్లడించారు. డీజిల్ లోకోషెడ్‌కు 28కోట్ల 15లక్షలు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు వంద ఇంజన్లను ఈ షెడ్‌లో మరమ్మతులు అవుతున్నాయని, ఇక నుండి 250 ఇంజన్‌లు మరమ్మతుకు నోచుకుంటాయన్నారు. అదేవిధంగా లోకోషెడ్‌లో కూడా 250 లోకో ఇంజన్లను మరమ్మతులు జరిగే విధంగా రైల్వేశాఖ చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే వరంగల్‌లో ప్రయాణికుల సౌకర్యార్ధం రెండు ఎక్స్‌లేటర్లను ప్రారంభించగా త్వరలోనే కాజీపేటలో మరో రెండు ఎక్స్‌లేటర్లను ప్రారంభించేందుకు రైల్వే అంగీకరించిందన్నారు. కాజీపేట రైల్వే ఆస్పత్రికి మరో రెండు రెఫరెల్ ఆస్పత్రులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు పృధ్వీ, జయ ఆస్పత్రులు మాత్రమే ఉండగా ఇక నుండి మ్యాక్స్‌కేర్, రోహిణి ఆస్పత్రులు కూడా ఉంటాయన్నారు. నెక్కొండలో రోడ్ అండర్‌బ్రిడ్జి, మహబూబాబాద్, డోర్నకల్‌లో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరయ్యాయని తెలిపారు. మణుగూరు నుండి రామగుండం వరకు ఫోర్ కారిడార్‌గా మార్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అదే విధంగా మణుగూరు నుండి కుంట్ల వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. అందుకోసం డిపిఆర్ పంపాల్సిందిగా కేంద్రం కోరిందని వివరించారు. డోర్నకల్, ఇల్లందు కారిడార్‌లు రీషెడ్యూల్ చేసేందుకు రైల్వే అంగీకరించిందని వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.