వరంగల్

మరో ‘చైన్ లింక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, ఏప్రిల్ 28: ఆన్‌లైన్‌లో గొలుసుకట్టు వ్యాపారాలు నిర్వహిస్తూ.. అక్రమంగా వినియోగదారులను మోసం చేసి వారివద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను గురువారం అరెస్టు చేసి వారి వద్దనుంచి సుమారు ఏడు లక్షల రూపాయల నగదు, ఒక ల్యాప్‌ట్యాప్, రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తొర్రూరు సిఐ శ్రీధర్‌రావు తెలిపారు. స్థానిక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన వజ్రపు నర్సింహమూర్తి అలియాస్ నరేష్, తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన పూసపల్లి రాజారాం అలియాస్ రాజు, సూర్యపేటకు చెందిన ఎడ్ల ఉప్పల్‌రెడ్డి అనే ముగ్గురు నిందితులు ఒక ముఠాగా ఏర్పాడి రేడియస్ గ్రూప్, ఆర్ జీ గ్రూప్, రీచ్ గ్లోబల్ మార్కెట్ తదితర పేర్లతో గత సంవత్సరం ఆగస్టు నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 3860 మంది వినియోగదార్ల నుండి నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయల వరకు అక్రమంగా వసులు చేశారన్నారు. వీరి వలలో పడి మోసపోయిన వినియోగదారుల ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు జరిపి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఆన్‌లైన్‌లో గొలుసుకట్టు వ్యాపారం చేస్తున్న నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తొర్రూరు ఎస్సై జీవీ సుబ్బారెడ్డి, రెండవ ఎస్సై లవకుమార్, ట్రైనీ ఎస్సై బాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.