వరంగల్

శ్రమించే సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసముద్రం, ఏప్రిల్ 28: విధి నిర్వహణ కోసం శ్రమించే సిబ్బందికి శాఖపరమైన గుర్తింపు ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. మంగపేట మండలం మల్లూరు నరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగిన 24గంటల లోపే నిందితులను పట్టుకొని కోటి రూపాయల విలువ గల పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గతంలోను స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయం, చిట్యాల మండలం ఒడితల గ్రామ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలోని చోరీకి గురైన ఏడు పంచలోహ విగ్రహాల సైతం గుర్తించడంలోను ప్రతిభ కనబర్చిన కమిషనరేట్ సిసిఎస్ సిబ్బందికి గురువారం పోలీసు కమిషనర్ నగదు రివార్డులతో పాటు శాఖపరమైన రివార్డులను అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనవాసరాజు, కానిస్టేబుళ్లు మహమ్మద్ అలీ, రవికుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ఇదే తరహాలో విధులు నిర్వహించి కమిషనరేట్‌కు కీర్తిప్రతిష్టలు తీసుకరావాలని తెలిపారు.