వరంగల్

ఫారెస్ట్ ట్రెంచ్‌లు ఆపకపోతే ఆత్మహత్యలే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగారం, జూన్ 18: గంగారం మండలంలో ఫారెస్ట్‌వారు ట్రెంచ్‌లు ఆపకపోతే భూములు కోల్పోయిన రైతులందరూ ఆత్మహత్యలు చేసుకోక తప్పదని పొడురైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు ప్రభాకర్ గంగారం సర్పంచ్ జెజ్జెరి వసంతలు అన్నారు. గంగారం మండలకేంద్రంలో నిన్నటి సంఘటనకు నిరసనగా సీపీఐ ఎంఎ ల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మహిళలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫారెస్ట్‌వారు ట్రెంచ్‌లువేసి తన భూమిని అన్యాయంగా లాక్కునందున మనస్థాపం చెందిన జెజ్జెరి వెంకటమ్మ అనే మహిళా రైతు ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని ముందు ముందు పొడుభూములు కోల్పోయిన ఇంకేందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతారో అని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక హరితహారం పేరుతో ఆదివాసి పేద రైతులు ఎన్నో దశాబ్ధాలుగా సాగుచేసుకుంటున్న భూములను లాక్కొవడం అన్యా యం అని ఇప్పటికైనా ఆ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమపార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వజ్జ సమ్మక్క, సమ్మన్న, కాంతారావు, పాపారావు, పెంట య్య, సూరమ్మ పాల్గొన్నారు.

లక్నవరం రోడ్డుకు మోక్షమెప్పుడో?
* శిలాఫలకానికే పరిమితం * అవస్థలు పడుతున్న పర్యాటకులు
గోవిందరావుపేట, జూన్ 18: ప్రము ఖ పర్యాటక కేంద్రమైన లక్నవరం వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యా లు కల్పించేందుకు ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిదులు మంజూరీ చేసినా పనులు ప్రారంభం కాలేదు. పంచాయ తీ రాజ్‌శాఖ బుస్సాపూర్ గ్రామం నుం చి లక్నవరం వరకూ బీటీ రోడ్డు నిర్మా ణం కోసం రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. పనులను ప్రారంభించేందుకు పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్ చేతుల మీదుగా 2016లో శిలాఫలకాన్ని అవిష్కరించినా నేటికి పనులకు మోక్షం కలగడం లేదు. రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించినా గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయని బుస్సాపూర్ గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పర్యాటకుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు పనులు ఇంకా మొదలుపెట్టకపోవడంతో లక్నవరం వచ్చిపోయే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్ధితి నెలకొంది. రోడ్డు నిర్మాణంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజప్తులు చేసినా పట్టించుకోవడం లేదని బుస్సాపూర్ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.