వరంగల్

నష్ట పరిహారం చెల్లించాలని టవర్ ఎక్కిన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జూన్ 18: సబ్ స్టేషన్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యుత్ టవర్‌ను ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. వారిని జనగామ పోలీసులు బుజ్జగించి కిందకి దింపి శాంతింపచేశారు. జనగామ మండలం శివారులోని చంపక్‌హీల్స్ వద్ద చేపడుతున్న 400కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం వడ్లకొండకు చెందిన 39 మంది రైతులు సుమారు 96 ఎకరాల భూమిని కోల్పోగా అందులో కొందరికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహా రం చెల్లించిందని, మిగతా తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు నిర్మాణాల్లో ఉన్న టవర్ల ఎక్కి ఆందోళనలు చేపట్టారు. 9 మంది రైతులు టరవ్లపైకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డబ్బులు వెంటనే చెల్లించాలని.. లేని పక్షంలో కింద దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఐ శ్రీనివాస్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వారిని సుమారు 20 నిమిషాట పాటు బ్రతిమలాడి టవర్లపైనుండి కిందకి దించారు. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఐ హామీ ఇచ్చిన తర్వాత వారు కిందకు దిగారు. కిందకు వచ్చిన అనంతరం రైతులు విలేకరులతో మాట్లాడుతూ సుమారు 2 సంవత్సరాలు కావస్తున్న తమకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయంలో కలెక్టర్ కార్యాలయం చుట్టూ అనేక సార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని అన్నారు. ఇక చేసేదేమీలేక ఆత్మహత్యకు పాల్పడుదామనే ఉద్దేశ్యంతోనే పైకి ఎక్కామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే కాకా తమ కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు.

22న మున్సిపల్ గదుల వేలం పాటలు
పరకాల, జూన్ 18: పరకాల పురపాలక సంఘం పరిధిలో ఉన్న మున్సిపల్ గదులలో కిరాయి కోసం ఈనెల 22వ తేదిన పరకాల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ జోనా తెలిపారు. అసక్తి గల టెండరు దారులు రూ. 30వేల డీడీతో పాటు రూ. 500 షెడ్యూల్డ్ ఫారం నింపి వేలమునకు ముందు వరకు కార్యాలయంలో అందచేయ చేయవచ్చునన్నారు.

ఐటీడీఏ ద్వారానే నియామకాలు
ఏటూరునాగారం, జూన్ 18: పాఠశాలల్లో వైద్యశాఖ నియామకా లు ఐటీడీఏ ఆధ్వర్యంలో జరగాలని తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కబ్బాక శ్రావణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఐటిడిఎ కార్యాలయంలోని కొమురం భీం విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గిరిబాల’ ఆరోగ్యరక్ష పధకాన్ని ప్రైవేటు సంస్దలకు అప్పగించడాన్ని తుడుందెబ్బ వ్యతిరేకిస్తోందన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు పొడెం రత్నం, కాపుల సమ్మయ్య, శంకర్, ఏఎన్‌ఎం, జిఎన్‌ఎం అభ్యర్దులు పాల్గొన్నారు.