వరంగల్

ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకాలు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 18: జిల్లాలో ఇప్పటివరకు పంపిణీ చేసిన పాసుపుస్తకాలలో దొర్లిన తప్పులను సరిచేసి ఆధార్ సీడింగ్, డిజిటల్ సంతకాలను వేగవంతం చేసి పంపించాలని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ తివారి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్బన్, రూరల్, జిల్లాలతో పాటు భూపాలపల్లి, మహబూబూబాద్, జనగామ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్‌నుండి ధరణి వైబ్‌సైట్ నమోదుపై, రాష్ట్ర భూప్రక్షాళన డైరెక్టర్ వాకాటి కరుణతో కలిసి కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్పెషల్ సెక్రటరీ మాట్లాడుతూ ఇప్పటివరకు పంపి ణీ చేసిన పేజీ-1,పేజీ-2లలో దొర్లిన తప్పుల గురించి ఆరా తీసారు. ధరణి వెబ్‌సైట్‌లో ఎమైన సమస్యలు ఎదురైతున్నాయా అని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తహశీల్ధార్లు వారి పరిధిలో గ్రామాల్లోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పాసుపుస్తకాల పంపిణీ, ఆధార్ సీడిం గ్, ఖాతాల మర్జింగ్, డాటా ఎంట్రీని వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు తెలిపారు. ఈ సందర్భం గా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ ఖాతా మర్జింగ్, ఆదార్ సీడింగ్, ధరణి డాటా ఎం ట్రీ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. డాటా కరెక్షన్ తహాశీల్ధారులతో వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. అదే విధంగా జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో వారం రోజులలోగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణ పూర్తి చేయ్యాలని రెవెన్యూ స్పెష్పల్ సీఎస్ రంజిత్ జిల్లాకలెక్టరకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ డివిజన్ అధికారి మహేందర్‌జీ, ధరణి కో ఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎంబీఏ పరీక్ష ఫీజు గడువు
కేయూ క్యాంపస్, జూన్ 18: కాకతీయ విశ్వవిద్యాలయం జూలై, అగష్టులో నిర్వహించే ఎంబీఏ ప్రథమ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్, ఎక్స్ క్యాండేట్స్ ఫీజు చెల్లించుటకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 5వ తేదిని నిర్ణయించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య మహేందర్‌రెడ్డి తెలిపారు. 250 రూపాయల అపరాధ రుసుముతో జూలై 10వతేది వరకు చెల్లించవచ్చునని అన్నారు.

21న కేయూలో యోగా దినోత్సవం
కేయూ క్యాంపస్, జూన్ 18: విశ్వవిద్యాలయం విరాళాల సంఘం అదేశాల మేరకు కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌లోని అనుబంధ కళాశాలలో జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించనునట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ మైదానంలో విశ్వవిద్యాలయ యోగ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనునట్లు ఆయన తెలిపారు.