వరంగల్

బంగారు తెలంగాణ కోసం సీఎం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, జూన్ 21: అన్నిరంగాలు అభివృద్ధి సాధించినప్పుడే బంగారుతెలంగాణ సాధ్యవౌతుందనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నాడని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మండలంలోని మొగిలిచర్ల, తట్టుపల్లి గ్రామాలలో సీఎం ప్రత్యేక నిధి కేటాయించిన సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పనులు, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాలలో రెడ్యానాయక్ మాట్లాడుతూ....డోర్నకల్ నియోజకవర్గాన్ని 119 నియోజకవర్గాలలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదద్దడమే తన ముందున్న లక్ష్యమని రెడ్యానాయక్ అన్నారు. గత శివరాత్రి సందర్భంగా సీఎం కురవి వీరన్నకు బంగారు మీసాలు సమర్పించిన సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన 25 కోట్లను గ్రామాల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. అన్నివర్గాలు సంతోషంగా ఉండాలంటే రైతాంగం సుభిక్షంగా ఉండాలని బావించి తెలంగాణ ప్రభుత్వం రైతాంగ అభివృద్ధికి అనేక సంక్షేమాలను తీసుకువచ్చిందన్నారు. రైతు బందు, రైతుబందు జీవిత బీమా యోజన పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం సాగునీటి కోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించి కాళేశ్వరం మహా ప్రాజెక్టును నిర్మిస్తుందన్నారు. వచ్చే ఏసంగి వరకు కాళేశ్వరం నీళ్లు డోర్నకల్ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువస్తానన్నారు. సాగునీటితో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. అన్నివర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు వెన్నంటి ఉండాలని రెడ్యానాకయక్ కోరారు.