వరంగల్

నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, జూన్ 21: తెలంగాణాలోని నిరుపేదల కళలు డబుల్‌బెడ్‌రూం పధకంతో నిజం అవుతున్నాయని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో గురువారం డబుల్‌బెడ్‌రూం పధకం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్దాపన చేశారు. ఈసందర్భంతా సర్పంచ్ పిన్నింటి కవిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చందూలాల్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో ప్రభుత్వం ఏన్నో సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తుందని అన్నారు. రైతుబంధు పధకంలో భాగంగా ఎకరాకు నాలుగువేల
రూపాయలు రైతుల పెట్టుబడి కోసం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అయితే తమ గ్రామంలో భూదాన్ పట్టా కింది ఏ ఓక్కరికి రైతు బందు చెక్కులు అందలేదని, లక్నవరం చెఱువు నీటిని కాలువద్వారా మచ్చాపూర్ గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, మరిన్ని డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరీ చేయాలని గ్రామస్ధులు మంత్రికి విన్నవించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఇటువంటి సమస్యలు ఉన్న గ్రామాల జాబితా ముఖ్యమంత్రి దగ్గర ఉందని, త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన గ్రామస్ధులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటి చైర్మెన్ అజ్మీర ప్రహ్లాద్, ములుగు ఆర్డీఓ రమాదేవి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షలు పల్లా బుచ్చయ్య, మండల అద్యక్షులు పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, గోవిందరావుపేట ఎంపిపి జెట్టి సుజాత, పస్రా సిఐ బాలాజీ, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.