వరంగల్

అభివృద్ధిలో ఓరుగల్లు పరుగులు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 23: వరంగల్ నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. శనివారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ గౌతమ్, సంబంధిత శాఖ అధికారులతో సుధీర్ఘంగా ఆమె సమీక్షించారు. హృదయ్ పథకం ద్వారా మంచి నీటి సరఫరా పనులు పురోగతి, స్మార్ట్ సిటీ ద్వారా చేపడుతున్న రూ.280కోట్ల పనులు కమాం డ్ కంట్రోల్ సెంటర్, ఫసాజ్ లైటింగ్ ఏర్పాట్లు, వేయి స్తంబాల దేవాలయ అభివృద్ధి జిల్లా సరిహద్దులలో కాకతీయ కళాతోరణాలు ఏర్పాటు, స్మార్ట్ సిటీ రోడ్డు, కల్వర్టులు, మున్సిపల్‌శాఖ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ జీ ప్లస్ త్రీ, సర్కిల్ కార్యాలయం జీ ప్లస్ టూ పనుల ప్రాధమిక అంచనాలు పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వేయి స్తం బాల దేవాలయం ఐదున్నర ఎకరాల్లో 8 కోట్ల వ్య యంతో ఆలయ సందరీకరణ, గార్డెన్ ఏర్పాటు, లై టింగ్ ఏర్పాటు, చేయనున్నట్లు ఆమె తెలిపారు. శిల్పారామం ఏర్పాటు చేయుటకు స్థలాన్ని ఎంపిక చేసి ప్రణాళీకలు సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల ద్వారా నగరంలోని ప్రధాన కూడళ్ళు అభివృద్ధి చేయడం, ఫాతిమానగర్ నుండి హంటర్ రోడ్డు వరకు లైటింగ్ ఏర్పాటు, మున్సిపల్ వార్డులున ప్రధానంగా విలీన గ్రామల్లో రోడ్ల అభివృద్ధి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పొచమ్మ మైదాన్, శాంతి నగర్‌లలో కల్వర్టుల అభివృద్ధి మొదలైన 284 పనులకుగాను 84 కోట్లతో టెండర్ల ప్రక్రియయ పూర్తి చేసి పనులు ప్రాధమిక దశలో ఉన్నాయని తెలిపారు. 2018-2019 సంవత్సరంలో చేపట్టబయో పనుల వివరాలు వారం రోజుల్లోగా పూర్తిచేసి నివేదికను అందించాలని ఆమె కోరా రు. ఇప్పటికే బస్టాండ్ సమీపంలో కూడలి అభివృద్ధి పబ్లిక్ గార్డెన్ అభివృద్ధి పనులతో పాటు 313 పనులకుగాను పరిపాలన అనుమతులు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. నగర కమిషనర్ గౌతమ్ మాట్లాడుతూ పబ్లిక్ గార్డెన్‌లో సీనియర్ సటీజన్స్‌కు సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసి వారంలో ఒక రోజు ఫిజియోతెరఫీ, న్యాయ సలహాలు అందజేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్లు, విద్యాసాగర్, వెంకట్రాం నర్సయ్య, శ్రీనివాస్, కూడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ హైవే ఇంజనీర్ అధికారులు పాల్గొన్నారు.