వరంగల్

చెరువుల పునరుద్ధరణ షురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం, ఏప్రిల్ 29 : మండలంలోని వెంకటాపురం, నారాయణపురం, నర్సాపురం గ్రామాల పరిధిలోని చెరువుల పునరుద్ధరణ పనులను మిషన్‌కాకతీయ రెండోదశ కింద ఆయా గ్రామాల సర్పంచ్‌లు శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా వెంకటాపురం పరిధిలోని లింగయ్యకుంటకు రూ.30లక్షలు, వడ్లకుంటకు రూ.13లక్షలు, నారాయణపురం పరిధిలోని లక్ష్మికుంటకు రూ.40లక్షలు, మొండికుంటకు రూ.38లక్షలు, నర్సాపురం పరిధిలోని పెద్దమల్లయ్యకుంటకు రూ.80లక్షల చొప్పున నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఎండి.రహీమొద్దీన్, గై రుద్రమదేవి, సామర్ల రాజమొగిలి, ఎంపిటిసిలు దగ్గు ప్రభాకర్‌రావు, రమరమణయ్య, గాజుల సుమలత, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోరిక హర్జీనాయక్, నాయకులు కొంపెల్లి రమణారెడ్డి, పోశాల వీరమల్లు, లింగాల రమణారెడ్డి, ఐబి ఎఇ నారాయణస్వామి, తడుక దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.